ఎనిమిదేళ్ళ తర్వాత టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇవ్వనున్న మంచు మనోజ్ హీరోయిన్.. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో  ఛాన్స్..

Actress Simran Kaur in Radheshyam Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దాదాపు ఎనిమిదేళ్ళ విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది హీరోయిన్ సిమ్రన్ కౌర్. ఈ ముద్దుగుమ్మ

ఎనిమిదేళ్ళ తర్వాత టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇవ్వనున్న మంచు మనోజ్ హీరోయిన్.. ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలో  ఛాన్స్..
Simran Kaur Mundi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2021 | 12:47 PM

Actress Simran Kaur in Radhe shyam Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దాదాపు ఎనిమిదేళ్ళ విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది హీరోయిన్ సిమ్రన్ కౌర్. ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన పోటుగాడు సినిమాలో హీరోయిన్‏గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఈ అమ్ముడుకు అవకశాలు రాకపోవడంతో.. నెమ్మదిగా టాలీవుడ్‏కు దూరమయ్యారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీతో తెలుగు తెరపై మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది.

మంచుమనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పోటుగాడు సినిమాలో వైదేహిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సిమ్రాన్ కౌర్. ఇక ఆ తర్వాత అవకాశాలు లేక టాలీవుడ్‏కు దూరమైంది. తాజాగా ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సందర్భంగా సిమ్రాన్ కౌర్ మాట్లాడుతూ.. కొన్ని వ్యక్తిగత కారణాల వలన కొంతకాలం వెండితెరకు దూరం కావాల్సి వచ్చింది. కొన్ని నెలల క్రితం రాధేశ్యామ్ టీం నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఈ సినిమాలో నాకు ఒక పాత్రను ఆఫర్ చేశారు. పాత్ర ఎంటీ అనేది తెలుసుకోకుండానే ఓకే చెప్పేశాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి షూటింగ్‏లో పాల్గొన్నాను. ఆ సినిమాలో నా పాత్ర ఎంతో కీలకమైంది. రాధేశ్యామ్ టీంతో నటించినందుకు ఆనందంగా ఉంది అంటూ చెప్పుకోచ్చింది సిమ్రాన్. ఈ మూవీకి రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో భాగ్య శ్రీ కీలకపాత్రలో నటిస్తుంది. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధకృష్ణ. ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదైలన ఈ మూవీ పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 30న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుంది చిత్రయూనిట్.

Also Read:

‘బుట్టబొమ్మ’ను వెనక్కునెట్టిన హైబ్రిడ్ పిల్ల.. విడుదలైన 14 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తున్న ‘సారంగదరియా’..

Major Movie Update: మేజర్‌ సందీప్ జయంతిన ‘మేజర్‌’ అప్‌డేట్‌.. ట్రైలర్‌ విడుదల చేస్తారా..?