Cheque books: ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు.. ఎందుకంటే..!

Cheque book: ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. అయితే నష్టాల్లో ఉన్న కొన్ని ..

Cheque books: ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు.. ఎందుకంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 15, 2021 | 8:57 AM

Cheque books: ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. అయితే నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. అలా విలీనం చేసిన బ్యాంకుల్లో దెనాబ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకులు ఉన్నాయి. 2019 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన విలీన ప్రక్రియ 2020 ఏప్రిల్‌ 1న ముగిసినా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు చెల్లుబాటు అయ్యాయి. ఇక వచ్చే నెల నుంచి ఈ బ్యాంకులు తమ ఖాతాదారులకు జారీ చేసిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు చెల్లుబాటు కావు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ బ్యాంకులు విలీనమైన బ్యాంకులకు సంబంధించి చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌ కోడ్‌లు, శాఖలు తదితర వివరాలు మారిపోతున్నాయి.

ఏఏ బ్యాంకులు విలీనం అయ్యాయి..

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా.. కెనరా బ్యాంకులో సిండికేట్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు ఇండియా బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంకు విలీనం అయ్యాయి. అయితే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌, ఇండియా బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకుల కస్టమర్లు ఈనెలాఖsyరులోగా తమ శాఖలను సంప్రదించి మారిన చెక్‌ బుక్‌లు, పాస్‌బుక్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌ కోడ్‌లు తెలుసుకోవాలి.

మొబైల్‌ నెంబర్లకు సమాచారం

కాగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకులు, ఇతర బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంకులు తమ ఖాతదారుల మొబైల్‌ నెంబర్లకు ఎప్పటిక్పుడు సమాచారం అందిస్తున్నాయి. మారనున్న ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌లు, ఎంఐసీఆర్‌ కోడ్‌ల గురించి మెసేజ్‌లు పంపుతున్నాయి.

మరి ఇతర డిపాజిట్ల సంగతేంటి..?

పాత బ్యాంకుల్లో తీసుకున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌, రికవరింగ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ట్రేడింగ్‌అకౌంట్‌లు, బీమా పాలసీ, ఆదాయం పన్ను ఖాతాలను అప్‌డేట్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిండికేట్‌ బ్యాంకు ఖాదారులు తమ వద్దకు వచ్చే జూన్‌ 30వ తేదీ వరకు పాత చెక్‌బుక్‌ల లావాదేవీలు జరుపుకొనేందుకు వెసులుబాటు కల్పించారు.

ఇవీ చదవండి :

Air travel: అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్‌

Air Conditioner: వేసవిలో ఏసీలు కొనేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. భారీగా పెరగనున్న ధరలు.. తప్పదంటున్న కంపెనీలు..!

IPPB New Charges : పోస్టల్ ఖాతాదారులకు షాక్ .. నగదు వేసినా .. తీసినా బాదుడే.. ఎప్పటి నుంచి అంటే..!