Air travel: అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్‌

Air travel: విమానం ఎక్కాలని ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయాన్ని తప్పుండా తెలుసుకోవాలి. మీ కోసం అదిరిపోయే ఆఫర్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది. చౌక ధరకే విమాన ప్రయాణం..

Air travel: అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్‌
Follow us
Subhash Goud

|

Updated on: Mar 14, 2021 | 3:48 PM

Air travel: విమానం ఎక్కాలని ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయాన్ని తప్పుండా తెలుసుకోవాలి. మీ కోసం అదిరిపోయే ఆఫర్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది. చౌక ధరకే విమాన ప్రయాణం చేసి ఎంజాయ్‌ చేయవచ్చు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ అదిరిపోయే ఆఫర్‌తో ప్రయాణికుల ముందుకు వచ్చింది. చౌక ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా ప్రాంతీయ అనుంబంధ సంస్థ, అలయన్స్‌ ఎయిర్‌ విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ వేసవిలో అలయన్స్‌ ఎయిర్‌ విమాన పాకెట్‌ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తోంది. తగ్గింపు ధరల్లో 60 వేల విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. 999 రూపాయల నుంచి టికెట్‌ ధర ప్రారంభం అవుతుంది. ఈ టికెట్ల అమ్మకం మార్చి 13 నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్‌ ద్వారా ప్రయాణికులు ఏప్రిల్‌ 1 నుంచి 2021 సెప్టెంబర్‌ 30 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు.

అయితే సీట్లున్నంత వరకు టికెట్లు ముందుగా ఎవరు బుక్‌ చేసుకుంటారో వారికే ఈ ఆఫర్‌ వర్తించనుందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ-జైపూర్‌, ప్రయాగ్‌రాజ్‌, హైదరాబాద్‌-బెలగాం, అహ్మదాబాద్ -కాండ్లా, బెంగళూరు-కొచ్చి , కాజీకోడ్‌ వంటి నగరాలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ప్రయాణకులు బయలుదేరడానికి వారం రోజుల ముందు తేదీని ఉచితంగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవీ చదవండి :

Covid-19 Effect: విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? అయితే నో ఎంట్రీ.. డీజీసీఏ కొత్త రూల్స్‌

AP Municipal Elections 2021: పటిష్టమైన భద్రతతో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. మార్గదర్శకాలు జారీ చేసిన ఎస్‌ఈసీ

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు