AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Rallied: రూ.లక్ష పెట్టుబడి పెడితే.. నాలుగు నెలల్లో రూ. 75 లక్షలు.. పంటపండటమంటే ఇదే మరి..!

Stock Rallied: డబ్బు సంపాదించడం కోసం వివిధ మార్గాలను ఎంచుకుంటారు. కొందరు తమ ఆదాయాన్ని బ్యాంకుల్లో ఇన్వెస్ట్..

Stock Rallied: రూ.లక్ష పెట్టుబడి పెడితే.. నాలుగు నెలల్లో రూ. 75 లక్షలు.. పంటపండటమంటే ఇదే మరి..!
Orchid Pharma Stock Rallied
Shiva Prajapati
|

Updated on: Mar 13, 2021 | 10:38 PM

Share

Stock Rallied: డబ్బు సంపాదించడం కోసం వివిధ మార్గాలను ఎంచుకుంటారు. కొందరు తమ ఆదాయాన్ని బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే.. మరికొందరు ఇతర స్కీమ్‌‌లలో పెట్టుబడులుగా పెడుతారు. ఇంకొందరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెడతారు. అయితే ఏదైనా కంపెనీలో షేర్లు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు మదుపరులు. ఒకవేళ వారి అదృష్టం బాగుందే అనుకోండి పంటపండినట్లే అనాలి. వారి షేర్ విలువ పెరిగితే భారీగా లాభాలు ఆర్జిస్తారు. తాజాగా ఇలాంటి ఊహించని అద్భుతమొకటి తాజాగా జరిగింది. పెట్టుబడిదారులు కళ్లుచెదిరే లాభాలను ఆర్జించారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఊహించని రీతితో లాభాలాను పొందారు. కేవలం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తక్కువ వ్యవధిలోనే రూ. 75 లక్షల వరకు సొమ్ము చేసుకున్నారు కొందరు ఇన్వెస్టర్లు. మరి అంతలా లాభాలు ఆర్జించి పెట్టిన కంపెనీ ఏంటి? ఆ ఇన్వెస్టర్లు సంపాదించినది ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్‌లో ఆర్కిడ్ ఫార్మా కంపెనీ షేర్ పరుగులు పెట్టింది. కేవలం 4 నెలల కాలంలో ఈ షేరు ధర ఏకంగా 7500 శాతం పైకి దూసుకు వెళ్లింది. దాంతో ఇన్వెస్టర్ల పంటపండింది. వారికి నమ్మలేని రాబడి లభించింది. వాస్తవానికి ఈ ఆర్కిడ్ ఫార్మా కంపెనీ దివాలా తీసింది. ఆ తరువాత గతేడాది నవంబర్ 3న మార్కెట్‌లో మళ్లీ లిస్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఆర్కిడ్ షేర్ పరుగులు పెడుతూనే ఉంది. అంటే గత నాలుగు నెలలుగా ఆ కంపెనీ షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. 2020 నవంబర్3న ఈ షేర్ ధర కేవలం రూ. 18. కానీ ఇప్పుడు ఆ షేర్ ధర రూ. 1370కి చేరింది. అంటే నాలుగు నెలల కాలంలో ఈ షేర్ ధర ఏకంగా 7500 శాతం పైకి కదిలిందన్న మాట. ఇదే కాలంలో బిట్ కాయిన్ షేర్ 203 శాతం మాత్రమే పెరిగింది. ప్రస్తుతం షేర్‌మార్కెట్‌లో బిట్‌కాయిన్‌ను తలదన్ని ఆర్కిడ్ షేర్ ఊపందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, నవంబర్ 3న రూ. లక్ష తో ఆర్కిడ్ షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లుకు ఇప్పుడు ఏకంగా రూ. 75 లక్షల రాబడి లభిస్తోంది. కరోనా సంక్షోభ సమయంలోనూ ఈ స్టాయిలో ఆర్జించి పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ సాధనం మరోకటి లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే.. ఇది నిజంగా పంటపండినట్లే కదండి.

Also read:

పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie With Goat

కరోనా టీకా వేసుకున్నాక మద్యం తాగవచ్చా ..! ఒకవేళ తాగితే ఏమవుతుంది..? అసలు వివరాలు తెలుసుకోండి..