కరోనా టీకా వేసుకున్నాక మద్యం తాగవచ్చా ..! ఒకవేళ తాగితే ఏమవుతుంది..? అసలు వివరాలు తెలుసుకోండి..
Drink Alcohol After Taking Corona Vaccine : మద్యం ఎప్పుడు శరీరానికి చెడునే కలుగజేస్తుందని అందరికి తెలుసు. అయినా
Drink Alcohol After Taking Corona Vaccine : మద్యం ఎప్పుడు శరీరానికి చెడునే కలుగజేస్తుందని అందరికి తెలుసు. అయినా కొంతమంది ప్రతిరోజు మద్యం తాగుతూ ఉంటారు. మరి కొంతమంది అది లేకుండా ఉండలేరు. కార్మికుడి నుంచి లక్షలు సంపాదించే సాప్ట్‌వేర్ ఉద్యోగి వరకు సాయంత్రం అయిందంటే చాలు చుక్క పడాల్సిందే అంటారు. అయితే కరోనా టీకా తీసుకున్నాక మద్యం తాగవచ్చా.. తాగొద్దా.. ఒకవేళ తాగితే ఏమవుతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారు.. తెలుసుకుందాం.
కొన్ని అధ్యయనాల ప్రకారం.. టీకా వేసిన 45 రోజుల తర్వాత మద్యం తాగితే టీకా ప్రభావం తగ్గిపోతుందని ఆశించిన ఫలితం దక్కక పోవచ్చని చెబుతున్నారు. ఇది రష్యన్ COVID-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి పాటించాల్సిన కచ్చితమైన నియమం అంటున్నారు. వాస్తవానికి టీకా వేయడం వల్ల దుష్పరినామాలు ఉంటాయని ఎక్కడా చెప్పలేదు. అది శాస్త్రీయంగా నిరూపణ కూడా కాలేదు. ఆల్కహాల్ వినియోగం యాంటీబాడీస్ ఉత్పత్తిని నేరుగా ప్రభావితం చేయదు. కనుక ప్రజలు టీకాలు తీసుకోవడం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ టీకా తీసుకున్నాక ఆల్కహాల్ మానేస్తే మంచి ఆలోచన అని చెప్పవచ్చు.
టీకా చర్యలో ఆల్కహాల్ వాడకం వ్యతిరేకం కానప్పటికీ, ఆల్కహాల్ అనేది మన రోగనిరోధక పనితీరును ప్రభావితం చేసే పదార్థం. ఈ దృక్పథంలో, టీకా తర్వాత 45 రోజులు మద్యపానాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్-ఉత్పత్తి చేసిన ప్రతిరోధకాలు తగిన, సురక్షితమైన ప్రతిస్పందనను అభివృద్ధి చేయడానికి 3 వారాల సమయం పడుతుంది. టీకాలు వేసిన తరువాత, శరీరానికి కొంత విశ్రాంతి తీసుకోవడం మరియు దుష్ప్రభావాలు తగ్గడానికి సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. ఎక్కువగా మద్యం తాగితే శరీరానికి ఎప్పుడూ చెడ్డది. టీకాలు వేసినా, వేయకపోయినా ప్రమాదకరం. అది మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.