CET Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష.. సెప్టెంబర్‌లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్..

CET Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ)ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో..

CET Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష.. సెప్టెంబర్‌లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్..
Central Minister
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 14, 2021 | 4:48 PM

CET Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ)ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో సీఈటీ నిర్వహించడానికి నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

‘‘యువతను, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడానికి, ఎంపికైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి.. ఈ సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహించడం జరుగుతుంది’’ అని మంత్రి జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఈ పరీక్ష బహుశా సెప్టెంబర్‌ నెలలో లేదా, 2021 చివరలో ఉండొచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత జోక్యం, యువత పట్ల ఆయనకున్న లోతైన శ్రద్ధ వల్ల ఈ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ ఎన్ఆర్ఏ.. గ్రూప్ బి, సి (నాన్-టెక్నికల్) పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిచండం, ఎంపికైన అభ్యర్థుల వివరాలను షార్ట్‌లిస్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్ఆర్ఏ ఏర్పాటులో భాగంగా దేశంలో ప్రతి జిల్లాలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సుదూర ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన ప్రతీ అభ్యర్థికి అవకాశం కల్పించడమే ఈ చారిత్రాత్మక సంస్కరణ యొక్క ముఖ్యం ఉద్దేశం అని పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో మహిళలు, దివ్యాంగ అభ్యర్థులు పరీక్షలు రాయడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా వారు చాలా ఇబ్బంది పడేవారు. కానీ, ఇప్పుడు తీసుకువచ్చిన విధానంతో మహిళలు, దివ్యాంగులు, ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు చేరువ అవుతాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపిఎస్) ద్వారా నియామకాలకు సంబంధించి ఎన్ఆర్ఏ ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తుందని, అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ఇది ఒక స్వతంత్ర, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని సింగ్ స్పష్టం చేశారు.

Also read: కాలిన గాయాలకు కలబంద దివ్యఔషధం.. ఇందులోని సుగుణాలు ఎన్ని రోగాలను నయం చేస్తాయో తెలిస్తే..

Air travel: అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్‌

AP Municipal Election Results 2021 LIVE: కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఏపీ పురపాలికల్లో వైసీపీదే హవా..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు