AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ ఫ్యాన్ జోరు కొనసాగుతోంది. మరోసారి  వైసీపీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుంది.  అన్ని జిల్లాల్లో వైసీపీ లీడ్‌లో దూసుకుపోతుంది.

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం
Balayya Jagan
Ram Naramaneni
| Edited By: Team Veegam|

Updated on: Mar 14, 2021 | 4:50 PM

Share

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ ఫ్యాన్ జోరు కొనసాగుతోంది. మరోసారి  వైసీపీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుంది.  అన్ని జిల్లాల్లో వైసీపీ లీడ్‌లో దూసుకుపోతుంది. అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల టీడీపీ గట్టి పోటి ఇస్తుందని భావించారు. కానీ అక్కడ కూడా సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ దూసుకెళ్లింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో కూడా జనాలు వైసీపీకే జై కొట్టారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా ప్రజలు టీడీపీగా మద్దుతుగా ఉన్నారు. కానీ ఈసారి సీన్ మారింది. హిందూపూర్ మున్సిపాలిటీని వై‌సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో ఫ్యాన్ పార్టీకి 27, టీడీపీకి 6, బీజేపీకి 1, ఎంఐఎం 1, ఇతరులు 1 వార్డును గెలచుకున్నారు.

కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్ని బాలయ్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. షూటింగ్ నిలిపివేసి స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేయకుండా భరోసాగా నిలిచారు. విబేధాలు లేకుండా నాయకులందర్నీ సమన్వయపరుస్తూ ముందుకెళ్లారు. ఆయన డెడికేషన్ చూసినవాళ్లందరూ టీడీపీ గెలుపు పక్కా అనుకున్నారు. కానీ హిందూపురం ఓటర్లు మాత్రం వైసీపీకే మద్దతుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ వేవ్‌ ఎదుర్కుని మరీ గెలిచిన బాలయ్య, పంచాయతీ, పుర పోరులో మాత్రం చతికిలపడ్డారు.

Also Read: ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల గురించి ఫిర్యాదు అందిందే 48 గంటల్లో పరిష్కారం.. వాలంటీర్లకు కీలక బాధ్యతలు

Also Read: Telangana Corona Cases: తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. తాజాగా 228 కేసులు నమోదు..

AP Municipal Election Results 2021 LIVE: కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఏపీ పురపాలికల్లో వైసీపీదే హవా..