AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల గురించి ఫిర్యాదు అందింతే 48 గంటల్లో పరిష్కారం.. వాలంటీర్లకు కీలక బాధ్యతలు

ఏపీలో ఇప్పుడు ఎల్‌ఈడీ వీధి దీపాల వెలుగులు పూస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలో ఎల్‌ఈడీ లైట్లకు సంబంధించి వచ్చే  ఫిర్యాదులను 48 గంటల్లోగా పరిష్కరించేలా

ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల గురించి ఫిర్యాదు అందింతే 48 గంటల్లో పరిష్కారం.. వాలంటీర్లకు కీలక బాధ్యతలు
Led Bulbs
Ram Naramaneni
| Edited By: Narender Vaitla|

Updated on: Mar 14, 2021 | 9:19 PM

Share

ఏపీలో ఇప్పుడు ఎల్‌ఈడీ వీధి దీపాల వెలుగులు పూస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలో ఎల్‌ఈడీ లైట్లకు సంబంధించి వచ్చే  ఫిర్యాదులను 48 గంటల్లోగా పరిష్కరించేలా పంచాయతీరాజ్‌శాఖ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఎల్‌ఈడీల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీల చేతిలోకి రాబోతుంది. ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌), పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (నెర్డ్‌క్యాప్‌)ల నుంచి ఎల్‌ఈడీల నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగిస్తూ ఈ నెల 3న ఏపీ సర్కార్ జీవో ఇచ్చింది.

ఒక్కో స్ట్రీట్ లైట్ నిర్వహణకు ఇంధన సంస్థలకు నెలకు 9.78 రూపాయిల చొప్పున గ్రామ పంచాయతీలు ఇకపై  చెల్లించాల్సిన అవసరం లేదు.  ఇక  గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను… వీధి దీపాల కోసం కూడా వినియోగించుకునేందుకు ఇంధనశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈఈఎస్‌ఎల్‌, నెర్డ్‌క్యాప్‌ సంస్థలు మరో రెండు, మూడు రోజుల్లో ఎల్‌ఈడీల నిర్వహణను పంచాయతీలకు హ్యాండోవర్ చేయనున్నాయి. నిర్వహణకు సంబంధించి ఈ నెల 15 నుంచి 30 వరకు గ్రామ కార్యదర్శులకు, ఎనర్జీ అసిస్టెంట్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణ విషయంలో ఇకపై వాలంటీర్లు కీలకంగా వ్యవహరించనున్నారు. లైట్లు వెలగకపోతే గుర్తించి గ్రామ కార్యదర్శికి కంప్లైంట్ చేసే బాధ్యత వారిదే. కార్యదర్శి నుంచి వచ్చే సమాచారంపై సచివాలయంలోని ఎనర్జీ అసిస్టెంట్లు సమస్యను పరిష్కరించాలి. పరిష్కారమైతే వాలంటీర్లు మళ్లీ కార్యదర్శికి చెప్పాలి. క్షేత్రస్థాయిలో కార్యదర్శి పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యిందో..లేదో క్రాస్ చెక్ చేసకోవాలి.

Also Read:  Telangana Corona Cases: తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. తాజాగా 228 కేసులు నమోదు..

Also Read: Summer Food: సమ్మర్ వచ్చేసింది.. శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవాలంటే వీటిని తినాల్సిందే..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..