Hindupuram Election Results: హిందూపురంలో అనూహ్య పరిణామం.. వైసీపీ, టీడీపీకి పోటీగా దూసుకొచ్చిన మరో పార్టీ..
AP Municipal Election Results 2021: హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
AP Municipal Election Results 2021: హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీకి పోటీగా ఎంఐఎం పార్టీ దూసుకొచ్చింది. ఎంఐఎం పార్టీకి చెందిన అభ్యర్థి హిందూపురం మున్సిపాలిటీలో ఒక చోట విజయం సాధించారు. కాగా, హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 38 వార్డులు ఉండగా.. వైసీపీ, టీడీపీ, జనసేన, ఎంఐఎం సహా ప్రధాన పార్టీలో పోటీ చేశాయి. కాగా, ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు 38 వార్డుల్లో వైసీపీ 7 వార్డుల్లో గెలుపొందగా.. టీడీపీ 3 చోట్ల గెలుపొందింది. ఇక అనూహ్య రీతిలో ఎంఐఎం ఒక వార్డును కైవసం చేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హిందూపురం మున్సిపాలిటీకి కూడా పోలింగ్ నిర్వహించారు. ఇవాళ కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులకు అధికారులు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే పలు వార్డుల ఫలితాలు వెలువడగా.. మరికొన్ని వార్డుల ఫలితాల కోసం ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. మధ్యాహ్నం సమయానికి హిందూపురం మున్సిపాలిటీకి సంబంధించి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Also read: AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా
Telangana Corona Cases: తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. తాజాగా 228 కేసులు నమోదు..