Summer Food: సమ్మర్ వచ్చేసింది.. శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవాలంటే వీటిని తినాల్సిందే..

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు మండిపోతున్నాయి. కొన్నాళ్లు ఆగితే ఎండ మాడు పగలగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక వడగాలలు కూడా వీచే ప్రమాదం ఉంది.

Summer Food: సమ్మర్ వచ్చేసింది.. శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవాలంటే వీటిని తినాల్సిందే..
Summer Drinks Food
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2021 | 7:23 PM

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు మండిపోతున్నాయి. కొన్నాళ్లు ఆగితే ఎండ మాడు పగలగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక వడగాలలు కూడా వీచే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. నీటి పరిణామం అధికంగా ఉంటే పండ్లు తింటే.. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ సీజన్లో, కొద్దిగా అజాగ్రత్త మీ ఆరోగ్యానికి హానికరం. కాగా ఏయే పండ్లు మనకు సమ్మర్‌లో సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం పదండి

పుచ్చకాయ

పుచ్చకాయలో 70 శాతం నీరు ఉంటుంది. ఇందులో నీరు మాత్రమే కాకుండా విటమిన్ సి, విటమిన్ ఎ,  మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు, పుచ్చకాయలో కేలరీల పరిమాణం కూడా తక్కువ. సో దీన్ని తినడం వల్ల బరువు పెరగదు.  మీ అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుచ్చకాయలో ఉన్నాయి.  దీనివల్ల డయాబెటిస్,  హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఉండదు.

నేరేడు పండు

నేరేడు పండులో బీటా-కెరాటిన్ ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. రోజూ తీసుకోవడం ద్వారా స్కిన్ ఆయిలీ కాకుండా ఉంటుంది.

దోసకాయ

వేసవిలో దోసకాయ తినడం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం ద్వారా శరీరంలో నీటి కొరత ఉండదు. దోసకాయలలో విటమిన్ కె, పొటాషియం, మెగ్నీషియం,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. దోసకాయ తినడం వల్ల ఎక్కువసేపు దాహం ఉండదు.

కివి

కివి యొక్క పుల్లని తీపి రుచి చాలా మందికి నచ్చుతుంది. దీనిలో విటమిన్ బి 1, బి 2, బి 3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీని తినడం వల్ల గుండె, పళ్లు, మూత్రపిండాలు,  మెదడుకు చాలా మంచి జరుగుతుంది.

పెరుగు

పెరుగులో విటమిన్లు, కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ ఎముకలకు కూడా మంచిది. మీరు 250 గ్రాముల పెరుగు తింటే, అందులో 75 శాతం నీరు ఉంటుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, పెరుగును ఆహారంలో చేర్చండి. ఇది మీ బరువును పెంచదు.

కొబ్బరి నీరు, మజ్జిగ

వేసవిలో, శరీరాన్ని చల్లగా ఉంచడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మంతో పాటు జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. ఇందులో కాల్షియం, క్లోరైడ్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి.

Also Read:

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…

ఆ ప్రాంతాల్లో వానర వనాలుగా మారిన ఊర్లు.. జనాభా కంటే కోతులే ఎక్కువయ్యాయి.. జనాల్ని టార్చెర్ చేస్తున్నాయి