AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Dialysis Hospital: దేశంలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రి.. ఉచితంగా డయాలసిస్‌, భోజనం.. ఎక్కడో తెలుసా..?

Kidney Dialysis Hospital: ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీగా మారిందో తెలిసిందే. చిన్న చిన్న జబ్బులకే వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం అంటే ఆస్తులు..

Kidney Dialysis Hospital: దేశంలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రి.. ఉచితంగా డయాలసిస్‌, భోజనం.. ఎక్కడో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Mar 14, 2021 | 3:49 PM

Share

Kidney Dialysis Hospital: ప్రస్తుతం రోజుల్లో చిన్నపాటి అనారోగ్యం బారిన పడినా వేలల్లో ఖర్చవుతుంది. ఇంకా పెద్ద పెద్ద జబ్బులు వస్తే మాత్రం ఇక లక్షల్లోనే. పెద్ద పెద్ద రోగాలకు ఉన్న ఆస్తులు సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చింది. రోజూ రూ.500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్‌ సౌకర్యం అందించేలా ఈ ఆస్పత్రిని నిర్మించారు. అయితే ఈ ఆస్పత్రిలో ఎటువంటి ఖర్చు ఉండదు. అంతా ఉచితమే. 20 ఏళ్లకుపైగా మూతపడి ఉన్న బాలాసాహిబ్‌ ఆస్పత్రిని గురుహరికృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ పేరుతో పునరుద్దరించి దేశంలోనే అతిపెద్ద కీడ్ని డయాలసిస్‌ ఆస్పత్రిగా మార్చారు. 24 గంటలూ రోగులకు వైద్య సేవలు అందించేలా సిద్ధం చేశారు. ఏకకాలంలో 101 మందికి డయాలసిస్‌ చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ప్రతి నిత్యం 500 మందికి డయాలసిస్‌ అందించేంత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం 101పడకలున్న ఈ ఆస్పత్రిని త్వరలో 1000 పడకలకు పెంచేందుకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అధ్యక్షుడు మంజిందర్‌సింగ్‌ సిర్సా వెల్లడించారు.

Kidney Dialysis Hospital

ఆస్పత్రిలో ఉచిత భోజన సౌకర్యం

అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో ఉచిత భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నిర్వహణకు అవసరమయ్యే వనరులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు, వివిధ ప్రభుత్వ పథకాల నుంచి సమకూర్చుకుంటారు. అయితే దేశంలో కిడ్నీ వైద్య రంగంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ల సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి: రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేస్తున్నారా..? అయితే ఈ రోగాలు మీ వెంటే.. జాగ్రత్త ఉండాలంటున్న వైద్యులు

Watermelon: పుచ్చకాయ ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో రోగాలు దూరమవుతాయి.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు

Beetroot Juice Benefits: రోజూ పరగడుపునే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుంది..? గర్భిణీలు తాగొచ్చా..?