215వసారి నామినేషన్ వేసిన ఎన్నికల రాజు పద్మరాజన్!
ఎన్నికలొస్తే చాలు పద్మరాజన్‌కు చటుక్కుమని ప్రత్యక్షమవుతారు. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడమనేది ఓ సరదా! మరో మూడు వారాల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా!
ఎన్నికలొస్తే చాలు పద్మరాజన్‌కు చటుక్కుమని ప్రత్యక్షమవుతారు. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడమనేది ఓ సరదా! మరో మూడు వారాల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా! మన పద్మరాజన్ నామినేషన్ వేసి పోటీకి సిద్ధమవుతున్నారు.. దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఈయన నామినేషన్ వేశారు.. వేస్తున్నారు. భవిష్యత్తులో కూడా వేస్తారు…అందుకే ఆయనను తేర్దల్ మన్నన్ అనేది! అంటే ఎన్నికల రాజు అని అర్థం.. మేట్టూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పద్మరాజన్‌కు గెలుపోటములతో అస్సలు పని లేదు.. నామినేషన్ వేశామా లేదా అన్నదే ఆయనకు ప్రాధాన్యం.
చదివింది ఎనిమిదో తరగతే! కాకపోతే రాజకీయాల పట్ల చక్కటి అవగాహన ఉంది.. అవి సహకార సంఘాల ఎన్నికలు కావచ్చు.. రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు.. పద్మరాజన్ నామినేషన్ వేయడం మాత్రం పక్కాగా జరుగుతోంది. అసలు ఈయన తొలిసారిగా నామినేషన్ వేయడంవెనుక ఓ కారణం ఉంది. 1988లో తొలిసారిగా మేట్టూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. ఎందుకటా అంటే ఇంటికి టెలిఫోన్ సౌకర్యం కోసమట! ఆ తర్వాత నామినేషన్లకు అలవాటు పడ్డారు.. అలా నామినేషన్‌లు వేస్తూ వెళుతున్న పద్మరాజన్‌కు గిన్నిస్ రికార్డు బుక్‌లోకి ఎందుకు ఎక్కకూడదన్న ఆలోచన వచ్చింది. అటు పిమ్మట అన్ని ఎన్నికల్లో నామినేషన్‌లు వేయడం మొదలు పెట్టారు..రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అగ్రనేతలు పోటీ చేసే స్థానాలలో నామినేషన్లు వేయసాగారు. డిపాజిట్‌కు డబ్బులు లేని సందర్భాలు కూడా ఉన్నాయి.. అలాంటి సమయాల్లో భార్య నగలు తాకట్టు పెట్టి మరి తన అభిలాష తీర్చుకున్నారాయన! ఇప్పటి వరకు ఆయన 20 లక్షల రూపాయలకు పైగా నామినేషన్ల కోసం ఖర్చు పెట్టారు.. పీవీ నరసింహారావు, వాజపేయి, జయలలిత, కరుణానిధి, ఏకే ఆంటోని, కేఆర్ నారాయణన్, ఎస్‌ఎం కృష్ణ. ఎంకే స్టాలిన్, విజయకాంత్ .. ఇలాంటి ప్రముఖులందరిపైనా పోటీ చేశారు.. అన్నట్టు 2014లో నరేంద్రమోదీపై కూడా పోటీకి దిగారు. అసలు పద్మరాజన్ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం, అందుకు డబ్బును తగలేస్తుండటం ఆయన భార్యకు ఇష్టం ఉండేది కాదుట! పిల్లలు కూడా ఎందుకొచ్చిన పోటీ అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారట! పద్మరాజన్ వింటేగా..! ఇక చెప్పి చెప్పి వారు అలసిపోయారు కానీ పద్మరాజన్ మాత్రం ఎలాంటి అలుపు సొలుపు లేకుండా నామినేషన్లు వేస్తూ వెళుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
Love Proposal: ఆమె మోకరిల్లింది.. అతను దాసోహమయ్యాడు.. కొన్ని తియ్యనైన కన్నీళ్లు.. వీడియో
KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై గళమెత్తిన కేటీఆర్, ఏపీ.. దేశంలో భాగం కాదా..! అని వ్యాఖ్య ( వీడియో )