Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…

నిజామాబాద్‌ జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు.

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్...
Treasure Hunt
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2021 | 5:58 PM

Treasure hunt:  నిజామాబాద్‌ జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. ఓ పురాతన గడీలో గుప్తనిధులు ఉన్నట్లు భావించిన గుర్తు తెలియని వ్యక్తులు గుట్టుగా వేట మొదలుపెట్టారు.

పెద్ద వాల్గొట్ గ్రామంలోని పురాతన గడీలో గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో తవ్వకాలు నిర్వహించారు. ఇంట్లోంచి పెద్దగా శబ్ధాలు రావడంతో అటుగా వచ్చిన గ్రామస్తులు…నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో గుప్తనిధుల కోసం వేటగాళ్లు గుళ్లు, గోపురాలు, పాడుబడ్డ పురాతన భవనాలను టార్గెట్‌గా చేసుకుని తవ్వకాలు జరుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. అటువంటి వారి వివరాలు తెలిస్తే..వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఇటీవల శివరాత్రి రోజు కూడా…

మహాశివరాత్రి రోజున నారాయణపేట జిల్లాలో గుప్తనిధుల కలకలం రేపింది. అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ పురాతన రామాలయంలో సన్నిధిలో గుర్తు తెలియని వ్యక్తులు..గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు గుర్తించారు ఇక్కడి స్థానికులు.

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలానికి చెందిన అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఉంది ఈ పురాతన రామదేవుడి మందిరం. మహా శివరాత్రి సందర్బంగా ఇక్కడి ఆలయంలో పూజలు చేయడానికి వచ్చిన స్థానికులు ఆలయ సమీపంలో భారీ గుంతను గుర్తించారు. మందిరం ముందు భాగంలో సుమారు 10 ఫీట్ల లోతైన గుంతలు కనిపించాయి. అవి చూసి స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. సమీపంలోనే గుప్తనిధుల తవ్వకాల కోసం పూజకు అవసరమైన సామాగ్రి, గుమ్మడి కాయలు ఉండటం గమనించారు. ఇదంతా చూసిన గ్రామస్తులు ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు..గుప్తనిధుల కోసమే ఈ భారీ గుంతను తవ్వినట్లుగా అనుమానిస్తున్నారు.అయితే, ఈ గుంత అడుగు భాగంలో మరో కట్టడం ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ నిధులు దొరికి ఉండవచ్చని లేదంటే…మరో మందిరం ఆనవాళ్లు కనపడడంతో తవ్వడానికి వీలు కాకపోవటంతో దుండగులు పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఆలయంలో తవ్వకాలు జరపడం ఇది రెండోసారి అంటున్నారు స్థానిక ప్రజలు.

Also Read:

AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు

ఆ ప్రాంతాల్లో వానర వనాలుగా మారిన ఊర్లు.. జనాభా కంటే కోతులే ఎక్కువయ్యాయి.. జనాల్ని టార్చెర్ చేస్తున్నాయి