AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీగా కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఇటీవలి కాలంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది.

AP Corona:  ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు
Andhra Pradesh Corona Updates
Ram Naramaneni
|

Updated on: Mar 13, 2021 | 4:05 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీగా కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఇటీవలి కాలంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది. కొత్తగా ఒక్క తీర్పుగోదావరి జిల్లాలోనే 41 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఒక్క అమలాపురం డివిజన్‌లోనే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుపయ్య అగ్రహారం 18వ వార్డులో హైద్రబాద్ నుండి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో  ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు అధికారులు.

అటు మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం లో దుబాయ్ నుండి వచ్చిన 40 ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందడంతో కోనసీమవాసులు భయాందోళనలో పడ్డారు. మలికిపురం యుపి స్కూల్ లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ తేలింది. వీరిలో నలుగురు ఉపాధ్యాయులు, ఒక వంటమనిషి ఉన్నారు. తుని పట్టణంలో 5 నెలల గర్భిణికి కరోనా సోకింది. పిఠాపురంలో రెండు కరోన కేసులు నమోదు కాగా, కొత్తపేట మండలం వానపల్లిలో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముందస్తు జాగ్రత్తగా 50 మీటర్ల పరిధిలో కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు అధికారులు.

అటు విశాఖలోని గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌లో కరోనా వైరస్ కలకలం రేపింది. స్కూల్‌లో నలుగురు విద్యార్థులకు వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు, సిబ్బంది తరగతి గదులు, పరసరాలను శానిటైజేషన్‌ చేయించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలను ప్రారంభించింది. అయినప్పటికీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అటు ప్రభుత్వంలో.. ఇటు ప్రజల్లో ఆందోళన మొదలైంది.

కాగా మహమ్మారి కరోనా వైరస్ మరోసారి విస్తరిస్తున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. చేతుల్ని ఎప్పుటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని, గుంపులు గుంపులుగా కలిసి ఉండొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు.

Also Read:

JR NTR Political Entry: నందమూరి చిన్నోడి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..? ఆయన సమాధానం ఇదే..

మోదీ సర్కార్ పెన్షన్ స్కీం.. నెలకు రూ. 3 వేలు పెన్షన్ పొందండి.. నమోదు చేసుకోండిలా.!