AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JR NTR Political Entry: నందమూరి చిన్నోడి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..? ఆయన సమాధానం ఇదే..

తెలుగుదేశం.. తెలుగువారి ఆత్మగౌరవమే పునాదిగా పుట్టిన పార్టీ. తెలుగు తెరపై తిరుగులేని రారాజుగా నిలిచిన అన్న ఎన్టీఆర్.. తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.

JR NTR Political Entry: నందమూరి చిన్నోడి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..? ఆయన సమాధానం ఇదే..
Jr Ntr
Ram Naramaneni
|

Updated on: Mar 13, 2021 | 3:45 PM

Share

తెలుగుదేశం.. తెలుగువారి ఆత్మగౌరవమే పునాదిగా పుట్టిన పార్టీ. తెలుగు తెరపై తిరుగులేని రారాజుగా నిలిచిన అన్న ఎన్టీఆర్.. తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు ఇప్పటికీ తెలుగువారిని తట్టిలేపుతూనే ఉంటాయి. కాగా ఎంతో ఘనచరిత్ర ఉన్న టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కుంటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో ఎరుగని ఓటమిని మూటగట్టుకున్న పార్టీ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బొక్కబోర్లాపడింది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో కూడా పార్టీ ఓటమి పాలయ్యింది. దీంతో అటు నాయకులతో పాటు కార్యకర్తలు కూడా నైరాశ్యంలో ఉన్నారు. ఈ క్రమంలోనే తారక్ యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి రావాలని అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితేనే పార్టీని తిరిగి గాడిలో పెట్టగలడని వారు బలంగా నమ్ముతున్నారు. ఇటీవలి కుప్పం పర్యటనలో కార్యకర్తలు బాహాటంగానే తారక్‌‌ను పార్టీలోకి తీసుకురావాలని అధినేతను కోరారు.

ఇదంతా ఓకే. అసలు తారక్ మనసులో ఏముంది. ఆయన యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి ఎప్పుడు రావాలనుకుంటున్నారు. హీరోగా టాలీవుడ్‌లో అగ్రపథాన కొనసాగుతున్న సమయాన.. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా అన్నవి ఇప్పుడు అటు కార్యకర్తలు, అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు. ఇదే ప్రశ్నను తాజాగా ఓ జర్నలిస్ట్‌ తారక్‌కు సంధించారు. దానికి ఎన్టీఆర్ తన మార్క్ స్పందన ఇచ్చారు. గుట్టు విప్పకుండా స్వీట్‌గా సైడైపోయారు. మీరే చెప్పండి ఎప్పుడు రావాలో అని తొలుత తిరిగి ప్రశ్నించిన ఎన్టీఆర్.. ఇప్పుడు దాని గురించే మాట్లాడే సందర్భం కాదంటూ దాటవేశారు. మరోసారి కూర్చునీ కాఫీ తాగుతూ తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పారు. సో.. దీనిపై మరింతకాలం సస్పెన్స్ కొనసాగించాలని తారక్ డిసైడయ్యారని తెలుస్తుంది.

కాగా ఒక వర్గం అభిమానులు అయితే ఎన్టీఆర్‌ను రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. అటు బాలయ్య సీనియర్ అయిపోయారు, ఇటు మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఇవ్వలేదు. కళ్యాణ్ రామ్ కెరీర్ ఆశాజనకంగా సాగటంలేదు. ఈ క్రమంలో ఫక్తు నందమూరి కుటుంబ అభిమానులుగా తమకు ఎన్టీఆర్ ఇంకొంతకాలం వెండితెరపైనే వినోదం పంచాలని కోరుతున్నారు. చూద్దాం తెలుగునాట నందమూరి చిన్నోడి ప్రయాణం మున్ముందు ఎలా సాగుతుందో.

Also Read:

ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మంటలు, పలు బోగీలు దగ్ధం

సెల్ఫీ వీడియో కోసం ట్రై చేసిన యువతి.. ఓ ఆటాడుకున్న పొట్టేలు… నవ్వులు పూయిస్తున్న వీడియో..

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు