సెల్ఫీ వీడియో కోసం ట్రై చేసిన యువతి.. ఓ ఆటాడుకున్న పొట్టేలు… నవ్వులు పూయిస్తున్న వీడియో..

ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫీలు, వీడియోలు తీయడం ఒక దినచర్యగా మారిపోయింది. సమయం ఉన్నా.. లేకున్నా.. రోజూ ఓ సేల్ఫీ

సెల్ఫీ వీడియో కోసం ట్రై చేసిన యువతి.. ఓ ఆటాడుకున్న పొట్టేలు... నవ్వులు పూయిస్తున్న వీడియో..
A Woman Kicked By A Goat Wh
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 13, 2021 | 2:47 PM

ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫీలు, వీడియోలు తీయడం ఒక దినచర్యగా మారిపోయింది. సమయం ఉన్నా.. లేకున్నా.. రోజూ ఓ సేల్ఫీ లేదంటే వీడియో తీయాల్సిందే. వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్‏కు అడిక్ట్ అయిపోతున్నారు. చాలా మంది లైక్స్, వ్యూస్ కోసం కొత్తగా ట్రై చేస్తుంటారు. ఇక ప్రస్తుతం ఎప్పుడో జరిగిన వీడియోలు కూడా మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. అందులో భాగాంగానే ఓ ఓల్డ్ వీడియో నెట్టింట్లో మళ్లీ వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది పాత వీడియోనే అయిన మరోసారి నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. ఇంతకు ఈ వీడియో ఏముందంటే.. ఇందులో ఒక అమ్మాయి.. కట్టేసిన పోట్టేలు దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుంది. సెల్పీ తీసుకుంటూ ఆ అమ్మాయి వివిధ రకాల హావాభావాలను పలికిస్తుంది. అయితే ఆ పోట్టేలు ఆ యువతిని ఢికోట్టేందుకు రెండు సార్లు ప్రయత్నిస్తూ.. విఫలమవుతుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం అదేం పట్టనట్లుగా వీడియో తీస్తునే ఉంటుంది. చివరకు ఆ పోట్టేలు గట్టిగా యువతి తలకు ఢీకోట్టేసింది. దాంతో వెంటనే నొప్పి భరించలేక తన చేతిలోని ఫోన్ పడేసింది. ఈ వీడియోలోని అమ్మాయికి ఎంత గాయం అయ్యిందనే విషయం మాత్రం తెలీదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయ్యండి.

Also Read:

Video: ఆకలి కోసం చిరుత హైనాల ఆరాటం.. రెండింటికి మధ్య జింక పిల్ల పోరాటం.. అంతలో అదిరిపోయే ట్విస్ట్.!

Mera Ration: కేంద్రం మరో ముందడుగు.. ‘మేరా రేషన్’ యాప్ ఆవిష్కరణ..

Aadhar Link to Bank Account: మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయ్యిందా? మొబైల్‌లోనే ఇలా చెక్ చేసుకోండి..