Aadhar Link to Bank Account: మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయ్యిందా? మొబైల్‌లోనే ఇలా చెక్ చేసుకోండి..

Aadhar Link to Bank Account: ఆధార్.. ఆధార్.. ఆధార్.. ప్రభుత్వం పనులు మొదలు.. ఏ పనికైనా ఈ ఆధార్ కార్డు అత్యంత ప్రామాణికంగా మారింది.

Aadhar Link to Bank Account: మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయ్యిందా? మొబైల్‌లోనే ఇలా చెక్ చేసుకోండి..
Aadhar Link To Bank Account
Follow us

|

Updated on: Mar 12, 2021 | 10:27 PM

Aadhar Link to Bank Account: ఆధార్.. ఆధార్.. ఆధార్.. ప్రభుత్వం పనులు మొదలు.. ఏ పనికైనా ఈ ఆధార్ కార్డు అత్యంత ప్రామాణికంగా మారింది. ఆధార్ లేకపోతే ఏ పని కూడా కాని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఆధార్ తప్పనిసరిగా కాదు అంటూ చెప్పుకున్న ప్రభుత్వాలు.. ఇప్పుడు ప్రతీ పనికి ఆధార్ తప్పనిసరిగా చేస్తూ వస్తున్నాయి. తాజాగా బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31వ తేదీ లోపు అన్ని రకాల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో స్పష్టమైన ప్రకటన చేశారు. నిర్ణతీయ గడువులోగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని, బ్యాంక్ అకౌంట్‌ పని చేయకపోవచ్చునని కూడా తెలిపారు. అందుకే ప్రజలందరూ తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నారు.

కాగా, ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్‌ లింక్ అయ్యిందా? లేదా అనే అనుమానాలు సహజంగానే అందరికీ వస్తాయి. ఈ నేపథ్యంలోనే మీరు మీ ఆధార్.. బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యిందా? లేదా? అనేది సులువుగా తెలుసుకోవచ్చు. కేవలం ఆధార్ నెంబర్‌తో మీ మొబైల్ ఫోన్ నెంర్ లింక్ అయితే చాలు బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్ సులభంగా తెలుసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు https://resident.uidai.gov.in/bank-mapper వెబ్‌సైట్‌కో వెళ్లాల్సి ఉంటుంది. సైట్ ఓపెన్ అవగానే.. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దాని ప్రకారం ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ కోడ్ క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ రెండూ ఎంటర్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కానట్లయితే.. మార్చి 31 వ తేదీలో పు లింక్ చేసుకోండి.

Also read:

GATE 2021 Results: మార్చి 22న గేట్ -2021 ఫలితాలు.. మీ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోండి.. ఫుల్ గైడెన్స్ మీకోసం..

Assembly Session: సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి.. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ పోచారం సమీక్ష

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!