GATE 2021 Results: మార్చి 22న గేట్ -2021 ఫలితాలు.. మీ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోండి.. ఫుల్ గైడెన్స్ మీకోసం..

GATE 2021 Result: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2021 ఫలితాలను మార్చి 22వ తేదీన విడుదల చేస్తామని...

GATE 2021 Results: మార్చి 22న గేట్ -2021 ఫలితాలు.. మీ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోండి.. ఫుల్ గైడెన్స్ మీకోసం..
Gate 2021 Result
Follow us

|

Updated on: Mar 12, 2021 | 9:40 PM

GATE 2021 Result: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2021 ఫలితాలను మార్చి 22వ తేదీన విడుదల చేస్తామని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బాంబే వెల్లడించింది. గేట్ 2021 ఫలితాలను దాని అధికారిక వెబ్‌సైట్‌ gate.iitb.ac.in లో విడుదల చేస్తామన్నారు. కాగా, గేట్ 2021 పరీక్షకు సంబంధించి ‘కీ’ పేపర్ ఫిబ్రవరి 26వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ‘కీ’ పేపర్‌పై అభ్యంతరాలు ఉంటే మార్చి 4వ తేదీ వరకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. ఆ గడువు ముగిసి చాలా రోజులు అవడం, వచ్చిన ఫిర్యాదు మేరకు సవరణ చేసిన అధికారులు.. తుది ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగానే మార్చి 22వ తేదీన గేట్ 2021 పరీక్ష ఫలితాలతో పాటు, ఫైనల్ ఆన్సర్ ‘కీ’ని కూడా విడుదల చేస్తామని ఐఐటీ బాంబే తెలిపింది. అభ్యర్థులు తమ తమ ఫలితాలు తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు.. గేట్ 2021 పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకునేందుకు ఈ కింది విధానాలను అనుసరిస్తే సరిపోతుంది. మరి ఆ విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గేట్-2021 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి..? 1. గేట్ అధికారిక వెబ్‌సైట్‌ gate.iitb.ac.in లో లాగిన్ అవ్వాలి. 2. హోమ్‌పేజీలో ‘గేట్ 2021 ఫలితాలు’ లింక్‌పై క్లిక్ చేయాలి. 3. ఆ లింక్‌పై క్లిక్ చేశా.. అభ్యర్థులకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 4. ఓపెన్ అయిన పేజీలో మీ అప్లికేషన్ ఐడి, పాస్‌వర్డ్ టైప్ ఎంటర్ చేయాలి. 5. వివరాలు సరైనవి అయితే మీ గేట్-2021 ఫలితాలు తెరపై కనిపిస్తాయి. 6. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవాలి.

ఇదిలాఉంటే.. గేట్ స్కోర్ కార్డుకు మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. అభ్యర్థులు ఈ వివరాలను భద్రంగా దాచుకుంటే ఉత్తమం. ఫిబ్రవరి 6, 7, 13, 14 తేదీల్లో గేట్-2021 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా విద్యార్థులు అప్లై చేసుకున్నారు. కాగా, గేట్ పరీక్షలో కొత్తంగా రెండు పేపర్లు ప్రవేశపెట్టారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(ఇఎస్), హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్(ఎక్స్‌హెచ్)తో సహా మొత్తం 27 పేపర్లకు పరీక్ష నిర్వహించారు.

Also read:

Wild Dog Movie: హైదరాబాద్‌ గోకుల్‌ ఛాట్‌ వద్ద బాంబు పేలుడు.. రంగంలోకి దిగిన విజయ్‌ వర్మ..

మహేశ్‌తో అనిల్ రావిపూడి ప్రయోగాత్మక సినిమా.. హీరోయిన్ రోల్ కోసం ఆమెను అప్రోచ్ అయ్యారట !