Wild Dog Movie: హైదరాబాద్ గోకుల్ ఛాట్ వద్ద బాంబు పేలుడు.. రంగంలోకి దిగిన విజయ్ వర్మ..
Wild Dog Movie: హైదరాబాద్ గోకుల్ ఛాట్‌లో ప్రజలంతా పనీపూరి, ఛాట్ తింటూ సంతోషంగా గడుపుతున్నారు.. ఒక్కసారిగా భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రెండు వారాలు గడుస్తోన్నా ఆ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరో నగర పోలీసులు తేల్చలేకపోతున్నారు. దీంతో...
Wild Dog Movie: హైదరాబాద్ గోకుల్ ఛాట్‌లో ప్రజలంతా పనీపూరి, ఛాట్ తింటూ సంతోషంగా గడుపుతున్నారు.. ఒక్కసారిగా భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రెండు వారాలు గడుస్తోన్నా ఆ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరో నగర పోలీసులు తేల్చలేకపోతున్నారు. దీంతో అధికారులు ఎన్‌ఐఏ సాయం తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆ బాంబును పేల్చింది ఎవరో తేల్చడానికి ఎన్ఐఏలో ఉన్న ది బెస్ట్ ఆఫీసర్ విజయ్ వర్మ రంగంలోకి దిగాడు. నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమా కథ ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే. కింగ్ నాగార్జున హీరోగా వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ సినిమాలో నాగ్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోని కోఠిలో ఉన్న గోకుల్ ఛాట్‌లో 2013లో జరిగిన బాంబు దాడిని ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేసింది. ఇదిలా ఉంటా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ‘వైల్డ్ డాగ్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం.
Presenting #WildDogTrailer https://t.co/NXWvln1HMD
FEROCIOUS,PATRIOTIC TALE OF A DAREDEVIL TEAM
My brother Nag is Cool & Energetic as ever He is a fearless actor attempting all genres
Wish Team #WildDog & my Producer Niranjan Reddy GoodLuck! @iamnagarjuna @MatineeEnt
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 12, 2021
ఇక ట్రైలర్ విషయానికొస్తే ఇందులో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపిస్తున్నాడు. ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం, వారిని కోర్టుల చుట్టూ తిప్పడం నచ్చని విజయ్ వర్మ దొరికిన ఉగ్రవాదులను దొరికినట్లు లేపేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కని చేయని పోలీసు అధికారి పాత్రలో నాగ్ మెప్పించాడు. కశ్మీర్ నేపథ్యంలో సాగే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. ‘ఒకడు మన దేశంలో వందల మంది అమాయకులను చంపి.. మీరేమి చేయలేరు అంటే.. నేను దానికి ఒప్పుకోను’ అని నాగార్జున చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ సినిమాను తొలుత ఓటీటీ వేదికగా విడుదల చేయాలని భావించారు. కానీ లాక్‌డౌన్ ఎత్తివేయడం, థియేటర్లు మళ్లీ ప్రారంభం కావడంతో చిత్ర యూనిట్ తమ ఆలోచనను మార్చుకుంది.
Also Read: మహేశ్‌తో అనిల్ రావిపూడి ప్రయోగాత్మక సినిమా.. హీరోయిన్ రోల్ కోసం ఆమెను అప్రోచ్ అయ్యారట !