Kangana Ranaut : గాంధీని టార్గెట్‌ చేసిన కంగనా, భార్య, సొంత బిడ్డలను వేధించినట్టు ఆరోపణలున్నాయని కామెంట్

Kangana Ranaut : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఈసారి మహాత్మాగాంధీని టార్గెట్‌ చేశారు. జాతిపితపై ఆమె వివాదాస్పద ట్వీట్‌ చేశారు. భార్యను , తన సొంత బిడ్డలను వేధించినట్టు..

Kangana Ranaut : గాంధీని టార్గెట్‌ చేసిన కంగనా,  భార్య,  సొంత బిడ్డలను వేధించినట్టు ఆరోపణలున్నాయని కామెంట్
Gandhi Kangana
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 12, 2021 | 5:48 PM

Kangana Ranaut : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఈసారి మహాత్మాగాంధీని టార్గెట్‌ చేశారు. జాతిపితపై ఆమె వివాదాస్పద ట్వీట్‌ చేశారు. భార్యను , తన సొంత బిడ్డలను వేధించినట్టు గాంధీజీపై ఆరోపణలున్నాయని అన్నారు కంగనా. మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి నిరాకరించినందుకు అతని భార్యను ఇంటి నుండి బయటకు నెట్టివేసినట్లు మహాత్మాగాంధీ గురించి వివిధ ప్రస్తావనలు ఉన్నాయని ఆమె అన్నారు. అయినప్పటికి గాంధీజీ జాతిపిత అయ్యారని కంగన చెప్పుకొచ్చారు. అతను ఒక గొప్ప భర్త కాకపోవచ్చు. కాని ఒక గొప్ప నాయకుడయ్యారు. పురుషాధిక్యత వల్లే ఇది సాధ్యమయ్యిందని అన్నారు కంగనా రనౌత్‌. గతంలో కూడా కంగనా చేసిన ట్వీట్లు చాలా వివాదాస్పదమయ్యాయి. ఈసారి ఆమె సరాసరి జాతిపిత గాంధీజీని టార్గెట్‌ చేయడం సంచలనం రేపుతోంది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న కంగన నిన్న మరో చిక్కులో పడ్డ సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై ఆమె చేసిన ట్వీట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మణీందర్ సింగ్ సిర్సా దాఖలు చేశారు. నిరసనల్లో పాల్గొంటున్న రైతులతో పాటు, సిక్కు సామాజికవర్గాన్ని కించపరిచేలా కంగన వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో ఆరోపించారు. కంగనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తిరస్కరించారని చెప్పారు. అందువల్లే తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.

అంతేకాదు, కంగన ట్వీట్లు దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని.. మత ఘర్షణకు దారితీసేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఈ పిటిషన్ ను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు… దీనిపై నివేదిక సమర్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్)ను ఏప్రిల్ 24లోగా అందజేయాలని ఆదేశించింది.

Read also : రెండు తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 164 మంది పోటీ, సినిమా పోస్టర్‌ సైజులో బ్యాలెట్‌ పేపర్.!