Actor Manoj Bajpayee: కరోనా బారినపడ్డ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్​పాయ్​.. షూటింగ్‌ సమయంలో వైరస్ వ్యాప్తి

బాలీవుడ్​ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్​పాయ్​కు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం అతడు హోమ్ క్వారంటైన్​లో ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు.

Actor Manoj Bajpayee: కరోనా బారినపడ్డ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్​పాయ్​.. షూటింగ్‌ సమయంలో వైరస్ వ్యాప్తి
Manoj Bajpayee
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 12, 2021 | 4:02 PM

బాలీవుడ్​ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్​పాయ్​కు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం అతడు హోమ్ క్వారంటైన్​లో ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. గత నెలలో ‘డెస్పాచ్​’ చిత్ర షూటింగ్​లో పాల్గొన్న మనోజ్.. డైరెక్టర్ కను బెల్​ వైరస్​ బారిన పడటంతో హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల టెస్టులు చేయించుకోగా, వైరస్ సోకినట్లు తేలింది. నార్త్‌తో పాటు, సౌత్‌లో కూడా ఉత్తమ నటుడిగా పేరుపొందిన మనోజ్.. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్​ సిరీస్​తో ఇటీవల సత్తా చాటారు. త్వరలో ఈ సిరీస్‌కు సీక్వెల్ రానుంది.

“మనోజ్ బాజ్‌పేయి రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ‘డెస్పాచ్’ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఇటీవల చిత్ర దర్శకుడు కరోనా బారిన పడ్డారు. ఇటీవల టెస్టులు చేయగా మనోజ్ బాజ్‌పేయికి కూడా కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆయన మెడిసిన్ తీసుకుంటున్నారు.   బాగా కోలుకుంటున్నారు. స్వీయ నిర్భందంలోనే ఉన్నారు” అని 51 ఏళ్ల నటుడి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో “డెస్పాచ్” షూట్ నిలిపివేయబడింది. పరిస్థితులు కుదుటపడ్డాక తిరిగి పున:ప్రారంభయ్యే అవకాశాలు ఉన్నాయి. 

కాగా మహారాష్ట్రలో గురువారం 14,317 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది ఒకరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగ్‌పూర్‌, థానే, అమరావతి, జలగావ్‌, నాసిక్‌, ఔరంగాబాద్‌ నగరాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుతుండటంతపై నీతి అయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌ నగరంలో ఒక్క రోజే 1800 కరోనా కేసులు నమోదు కావడంతో మార్చి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దేశంలోనే 60 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదు కావడంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. 

Also Read:

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి..

పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అగ్నిప్రమాదం.. పిల్లర్లకు అంటుకున్న మంటలు.. దట్టంగా వ్యాపించిన పొగ