Prabhas Adipurush: రాముడికి సీత దొరికింది..! ప్రభాస్‌ సరసన నటించేది ఆ భామే.. వైరల్‌గా మారిన ఫొటోలు..

Prabhas Adipurush: 'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ప్రపంచాన్ని ఈ సినిమా ఆకర్షించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ పేరు మోరుమోగింది. భాషతో సంబంధం లేకుండా ప్రభాస్‌కు అభిమానులు పెరిగిపోయారు...

Prabhas Adipurush: రాముడికి సీత దొరికింది..! ప్రభాస్‌ సరసన నటించేది ఆ భామే.. వైరల్‌గా మారిన ఫొటోలు..
Adipurush
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 12, 2021 | 3:54 PM

Prabhas Adipurush: ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ప్రపంచాన్ని ఈ సినిమా ఆకర్షించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ పేరు మోరుమోగింది. భాషతో సంబంధం లేకుండా ప్రభాస్‌కు అభిమానులు పెరిగిపోయారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తోన్న ప్రతీ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్‌ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకునే చిత్రాలను ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెరకెక్కుతోందే ‘ఆదిపురుష్‌’ సినిమా. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. రామాయణ ఇతివృత్తంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా ప్రతినాయకుడి పాత్రలో రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నాడు. ఇక లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్‌ నటిస్తున్నాడు.

Prabhas

Prabhas

ఇదిలా ఉంటే సినిమాలో మరో ప్రధాన పాత్ర అయిన సీత గురించి మాత్రం చిత్ర యూనిట్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదిపురుష్‌లో ప్రభాస్‌ సరసన సీత పాత్రలో అనుష్క, కీర్తి సురేశ్‌ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ వీటిపై చిత్ర యూనిట్‌ మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ చిత్ర బృందం ఈ చిత్రంలో సీతగా కృతిసనన్‌ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘ఆదిపురుష్‌’ సెట్‌లోకి కృతిసనన్‌, సన్నీసింగ్‌లకు స్వాగతం పలుకుతూ తాజాగా సినిమా యూనిట్‌ కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. అందులో ప్రభాస్‌, కృతిసనన్‌, సన్నీసింగ్‌ కలిసి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక నటి కృతిసనన్‌ కూడా ఈ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘కొత్త ప్రయాణం ప్రారంభం’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Also Read: Jamuna: సినీనటి జమున గారి బయోపిక్ లో చేయబోయే ఆ తెలుగు హీరోయిన్ ఎవరంటే…??

Karisma Daughter Samaira :కరిష్మా కుమార్తె సమైరా పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేసిన కరీనా, తైమూర్ లు

Gummadi Narsaiah Biopic: 5 సార్లు ఎమ్మెల్యే.. అత్యంత సాధారణ జీవితం.. త్వరలో ఆయన బయోపిక్ !