రెండు తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 164 మంది పోటీ, సినిమా పోస్టర్‌ సైజులో బ్యాలెట్‌ పేపర్.!

Telangana MLC Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరికి సంబంధించి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 71మంది బరిలో నిలిచారు. మొత్తం 76మంది..

రెండు తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 164 మంది పోటీ,  సినిమా పోస్టర్‌ సైజులో బ్యాలెట్‌ పేపర్.!
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 12, 2021 | 4:40 PM

Telangana MLC Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరికి సంబంధించి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 71మంది బరిలో నిలిచారు. మొత్తం 76మంది అభ్యర్థులు 123సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో ముగ్గురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ తరఫున రాములు నాయక్.. బీజేపీ – ప్రేమేందర్‌ రెడ్డి, సీపీఐ- జయసారథి, తెలంగాణ జన సమితి – కోదండరాం, యువతెలంగాణ పార్టీ – రాణి రుద్రమ, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్‌లతో పాటు మొత్తం 71మంది బరిలో నిలిచారు.

ఇక, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు మరోసారి బరిలోకి దిగగా.. టీఆర్ఎస్ నుంచి మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణిదేవి.. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి పోటీలో నిలిచారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కాగా, రెండు స్థానాలకు మొత్తం 164మంది పోటీపడుతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. బ్యాలెట్‌ పేపర్‌లో ప్రతి అభ్యర్థికి కనీసంగా నాలుగు సెంటీమీటర్ల స్థలం కేటాయిస్తారు. దీంతో ఈ ఎన్నికలో బ్యాలెట్‌ పేపర్ సినిమా పోస్టర్‌ సైజులో ఉండనుంది. ఓటర్లకు ఇది ఒక పరీక్షగా నిలవనుంది. ఓటు వేసేందుకు చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. పోలింగ్ ముగిసినా కౌంటింగ్ ప్రక్రియ అంత ఈజీగా కనిపించడం లేదు. గతంలో ఒక స్థానంలో 57మంది పోటీ చేసినప్పుడే.. ఫలితం వెల్లడించేందుకు రెండున్నర రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఒక స్థానంలో 93.. మరో స్థానంలో 71మంది పోటీపడుతున్నారు. దీంతో కౌంటింగ్ నాలుగైదు రోజుల సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Read also : అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దూకుడు, 173 మంది అభ్యర్థులతో తొలి జాబితా, కొలతూర్ నుంచి స్టాలిన్, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ

Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర
Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?