వరంగల్‌లో జాతీయ జెండావిష్కరించిన గవర్నర్.. తమిళిసైకి ఘన స్వాగతం పలికిన మంత్రి ఎర్రెబెల్లి
భాతర దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా..
భాతర దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్టంలో రెండు చోట్ల ప్రారంభించింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనగా, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వరంగల్ పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.
గవర్నర్‌కు మంత్రి ఎర్రబెల్లి ఘన స్వాగతం వరంగల్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ర్టంలో 75 వారాల పాటు ఈ ఉత్సవ వేడుకలు కొనసాగనున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో బాగంగా వరంగల్ కు చేరుకున్న గవర్నర్ తమిళిసైకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘనస్వాగతం పలికారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో గవర్నర్ కు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రజల నుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.
వినూత్నంగా స్వాగతం పలికిన వినయ్ భాస్కర్ గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ వినూత్న రీతిలో స్వాగతం పలికారు. తన ప్రోటోకాల్ వాహనాలు పక్కనపెట్టి సైకిల్ పై వెళ్లి స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు. హన్మకొండ బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయం నుండి పరేడ్ గ్రౌండ్ వరకు సైకిల్ పై వెళ్లి గవర్నర్ కు స్వాగతం పలికిన వినయ్ భాస్కర్.
Read More:
టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వెల్లువెత్తుతున్న మద్దతు.. మంత్రి హరీశ్‌రావుతో పలు అసోసియేషన్ల భేటీ