టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వెల్లువెత్తుతున్న మద్దతు.. మంత్రి హరీశ్‌రావుతో పలు అసోసియేషన్ల భేటీ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వాణీ దేవి, పళ్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు సాంస్కృతిక రాష్ట్ర అసోసియేషన్, ‌వేద‌దార్మిక సేవా సమితి, సంభాషణ సంస్కృతం అసోసియేషన్ లు..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వెల్లువెత్తుతున్న మద్దతు.. మంత్రి హరీశ్‌రావుతో పలు అసోసియేషన్ల భేటీ
Follow us
K Sammaiah

|

Updated on: Mar 12, 2021 | 1:24 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వాణీ దేవి, పళ్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు సాంస్కృతిక రాష్ట్ర అసోసియేషన్, ‌వేద‌దార్మిక సేవా సమితి, సంభాషణ సంస్కృతం అసోసియేషన్ లు ప్రకటించాయి. ఇవాళ హైదరాబాద్ లో సంస్కృతిక రాష్ట్ర అసోషియేషన్ అధ్యక్షులు సాధన నరిసింహచార్యులు, వేద దార్మిక సేవా సమితి అధ్యక్షులు కొండపాక కృష్ణమాచార్యులు, సంభాషణ సంసృతం అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర కృష్ణ ఈ మూడు అసోషియోషన్ల గౌరవాధ్యక్షులు రవీందర్ సింగ్ నేతృత్వంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలుసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అసోసియేషన్ తీర్మాన ప్రతిని మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఎంతో మంది పేదలకు సీఎం కేసీఆర్ ఆర్థిక ‌సాయం చేస్తున్నారని కొనియాడారు. తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందుకు మంత్రి హరీశ్ రావును అభినందించారు.

కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ నేతల మద్దతు

ఇక రాష్చ్రంలోని 11 యూనివర్సిటీ లకు‌ చెందిన కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ నేతలు మంత్రి హరీశ్ రావును హైదరాబాదులో కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు వాణి దేవి, పళ్లా రాజేశ్వర్ రెడ్డిలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారు తీర్మాన ప్రతిని అందజేశారు. కాంటాక్ట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు‌. తమ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపిన యూనివర్సిటీ‌ కాంట్రాక్టు టీచర్లను అభినందించారు. సమస్యలను సీఎ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామన్నారు.

ప్రచారాన్ని వేడెక్కిస్తున్న హరీశ్‌రావు తెలంగాణ రాజకీయాలు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వేడెక్కాయి. జరిగేది పట్టభద్రుల ఎన్నికలే అయినా.. జరుగుతున్న వాతావరణం చూస్తే సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. వరుస వైఫల్యాలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారంతో వేడెక్కిస్తున్నారు. మరోవైపు కరోనాతో కుదైలైనా ఆర్థిక రంగానికి మంత్రి హరీష్ రావు ఎలాంటి వ్యాక్సిన్ ఇస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.

నా మాటలు అబద్దమని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా -పల్లా ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలకు భయపడేది లేదన్నారు. ఉద్యోగ నియామకాలపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. మేనిఫెస్టోలోని అనేక హామీలను ఇప్పటికే నెరవేర్చామన్నారు. పార్టీలో అలకలు, అసంతృప్తులు మామూలేనన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్దతుగా ఉన్నారని పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Read More:

ఖమ్మం గుమ్మంలోకి టెక్నాలజీని తెచ్చాం.. ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ

ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రారంభం.. గాంధీజీ సత్యాగ్రహ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం -సీఎం కేసీఆర్‌

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..