AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యధికశాతం ఓటింగ్‌ నమోదు కావాలి.. పట్టభద్రులు బద్దకం వీడి పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టాలి -మహ్మూద్‌ అలీ

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. ఇక ఇంత కాలం ప్రచారంలో పోటీపడ్డ అన్ని పార్టీలు ఇప్పుడు ఓటర్లను..

అత్యధికశాతం ఓటింగ్‌ నమోదు కావాలి.. పట్టభద్రులు బద్దకం వీడి పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టాలి -మహ్మూద్‌ అలీ
Md Ali
K Sammaiah
|

Updated on: Mar 13, 2021 | 7:11 AM

Share

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. ఇక ఇంత కాలం ప్రచారంలో పోటీపడ్డ అన్ని పార్టీలు ఇప్పుడు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పోటీ పడుతున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్‌ ఓటర్లను ఇతర పద్దతుల్లో ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు.

ఈనెల 14వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచాలని తద్వారా టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ కోరారు. హైదరాబాదులోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ లో శుక్రవారం నాడు మాట్లాడుతూ..గ్రాడ్యుయేట్ ఓటు అసాధారణమైన అవకాశం అని దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమకు సంబంధించిన విషయాలను చట్ట సభలలో వినిపించవచ్చునని హోం మంత్రి సూచించారు. గరిష్ట ఓటింగ్ శాతం నమోదు చేయడం ద్వారా గ్రాడ్యుయేట్లు మరియు యువకుల సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్సీలు గళం విప్పవచ్చని పేర్కొన్నారు.

విద్యావంతులు ఓటు వేయడం ద్వారా హైదరాబాద్- రంగా రెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల టిఆర్ఎస్ ఎంఎల్ సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్. వాణీ దేవి ని గెలిపించాలని హోం మంత్రి కోరారు. గ్రాడ్యుయేట్లందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ప్రయత్నించాలని, తద్వారా రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకావాలని అన్నారు. ఉత్తమ మరియు సమర్థవంతమైన ఎమ్మెల్సీనీ ఎంపిక చేసి శాసనమండలికి పంపించినట్లైతే యువత, నిరుద్యోగులతో పాటు, ఉద్యోగులు మరియు గ్రాడ్యుయేట్ల సమస్యలను కౌన్సిల్‌ లో చర్చిస్తారని తెలిపారు.

మౌలానా ఆజాద్ యూనివర్సిటీ గొప్ప పేరున్న యూనివర్సిటీ అని,భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు . భారత దేశ సంక్షేమం కోసం తన చివరి శ్వాస వరకు పనిచేశారని అన్నారు. రైతుల ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఇతర రాష్ట్రాల రైతులతో పోలిస్తే తెలంగాణ రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, రైతు బంధు, రైతు భీమా వంట పథకాలే కాకుండా రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయనీ,ఇక్కడి రైతులు ఆత్మవిశ్వాసం, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని తెలిపారు.

హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ సమర్థవంతమైన అభ్యర్థి ఎస్ వాణిదేవిని నిలబెట్టిందనీ ఇప్పటివరకు ఆమె ఎటువంటి రాజకీయ మద్దతు లేకుండా యువతకు, నిరుద్యోగులకు, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గొప్ప సేవ చేశారనీ తెలియజేశారు. ఆమె అనేకసార్లు జాబ్ ఫెయిర్లను నిర్వహించి యువతకు ఉపాధి కల్పించారని ఆమెకు ఓటు వేయడం ద్వారా తాము సరైన అభ్యర్ధిని కౌన్సిల్ కు పంపాలని కోరారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం క్రమంగా అభివృద్ధి చెందుతోందని హోంమంత్రి చెప్పారు.

నేడు తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ప్రత్యేక స్థానం ఉందనీ, తెలంగాణలో సంక్షేమ పథకాలు కాకుండా, ముస్లిం మైనారిటీలు మరియు మహిళల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి-భద్రతలు , వాతావరణం చక్కగా ఉన్నందున విదేశీ కంపెనీలు తెలంగాణకు తరలివస్తున్నాయనీ, ఇవి తెలంగాణ ప్రజలకు ఉపాధి కలించడంతో పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తూ దోహద పడతాయని అన్నారు.ఎం ఎల్ సి ఎన్నికల ప్రచారం చివరి రోజైన శుక్రవారం నాడు హోం మంత్రి మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వ విద్యాలయం, నిజామియ మెడికల్ కళాశాలల తో పాటు రమంతపూర్ లో జరిగిన కార్యక్రమలలో పాల్గొన్నారు.

Read More:

కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.. అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం