నేడు ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవం.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవాన్ని ఆమె అభిమానులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు నిజామాబాద్‌ జిల్లాతో..

నేడు ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవం.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు
Follow us
K Sammaiah

|

Updated on: Mar 13, 2021 | 7:31 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవాన్ని ఆమె అభిమానులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఇటు హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక కవిత కార్యాలయంతో పాటు ఇంటి వద్ద జన్మదినోత్స బ్యానర్లను కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కవిత జన్మదినోత్సం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అన్నదానాలు, రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంచిపెట్టి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక కవితకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులతో తన నివాసం సందడిగా మారింది.

ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌ ,కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏసీటీ ఇంచార్జి రవి సాయల ఆధ్వర్యంలో కాన్బెర్రాలో కవిత దీర్ఘాఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన తమ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అనతి కాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకొని, వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తుందన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన కవిత అక్కకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాజేష్ గిరి రాపోలు, సాయిరాం ఉప్పు, ప్రవీణ్ పిన్నమ, శ్రీకాంత్ రెడ్డి, రవి యాదవ్, రాకేష్ లక్కరసు, వీరు సాంబరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి నాయకుడు నరాల సుధాకర్‌ రచించిన పాట వీడియోను శుక్రవారం టీ ఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు విడుదల చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాటను విడుదల చేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి కవిత జన్మదినం సందర్భంగా దాదాపు 9 పాటలు విడుదల చేయడం గొప్ప విషయమని నరాల సుధాకర్‌ను రాంకిషన్‌రావు అభినందించారు.

‘రామసక్కని తల్లి రా.. రామన్న చెల్లిరా..’ అనే పల్లవితో సాగే ఈ పాట అద్భుతంగా వచ్చిందని, చి త్రీకరణ కూడా బాగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావ్‌, నాయకులు అపర్ణ, సాయికృష్ణ, రాజన్న, కొయ్యాడ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More:

అత్యధికశాతం ఓటింగ్‌ నమోదు కావాలి.. పట్టభద్రులు బద్దకం వీడి పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టాలి -మహ్మూద్‌ అలీ

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వెల్లువెత్తుతున్న మద్దతు.. మంత్రి హరీశ్‌రావుతో పలు అసోసియేషన్ల భేటీ

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..