AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై పిటిషనర్ కు చక్కెదురు.. పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సొసైటీ బైలాస్‌లోని రూల్‌ 22ఏను..

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై పిటిషనర్ కు చక్కెదురు.. పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు
K Sammaiah
|

Updated on: Mar 13, 2021 | 8:00 AM

Share

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సొసైటీ బైలాస్‌లోని రూల్‌ 22ఏను అమలును నిలిపేస్తూ కోఆపరేటివ్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని బొల్లినేని రవీంద్రనాథ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. (WP 5611/2021) ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ బెంచ్‌ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది.

కమిటీ సభ్యుల పోటీపై నిషేధం విధిస్తున్న నిబంధనలను చట్టం నుంచి తొలిగించిన నేపథ్యంలో రూల్‌ 22ఏ ను అమలు చేయాల్సిన అవసరం లేదని కోఆపరేటివ్‌ కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ జారీచేశారు. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోఆపరేటివ్‌ కమిషనర్‌ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైందని, ఒక్కసారి నోటిఫికేషన్‌ విడుదల అయిన తర్వాత జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. కోఆపరేటివ్‌ సొసైటీస్‌ యాక్ట్‌ ప్రకారమే కమిషనర్‌ వ్యవహరించారని స్పష్టంచేశారు.

బైలాస్‌ అనేవి ఒక సొసైటీకి చెందినవి మాత్రమేనని వాటిని చట్ట ప్రకారం అమలు చేయడం సాధ్యం కాదని తెలిపారు. కోనసీమ కోఆపరేటివ్‌ సొసైటీ కేసు, మున్సిపల్‌ ఎన్నికల కేసుల్లో హైకోర్టు తీర్పులను ఉదహరించారు. నోటిఫికేషన్‌ విడుదలైనందున పిటిషన్‌ విచారణార్హం కాదని రామచంద్రరావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ పోటీ చేయడానికి అందరికీ అవకాశం ఉండాలని, సభ్యల పోటీపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎలక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. మెజార్టీ సభ్యుల విశ్వాసం పొందిన వారు గెలుస్తారని, పోటీ చేసే అవకాశం అందరికీ ఉండాలన్నదే సొసైటీ ఉద్దేశమని పేర్కొన్నారు.

తాము ఎన్నికల ప్రక్రియను సవాల్‌ చేయడం లేదని, నోటిఫికేషన్‌ కంటే ముందు కోఆపరేటివ్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను మాత్రమే కొట్టేయాలని కోరుతున్నామన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ కొట్టేయాలన్న మధ్యంతర దరఖాస్తును కొట్టేస్తూ ఆదేశాలు జారీచేసింది.

సొసైటీ బైలాస్‌లోని రూల్‌ 22ఏను అమలును నిలిపేస్తూ కోఆపరేటివ్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శుక్రవారం తీర్పు వెలువరించిన జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ బెంచ్‌ పిటిషన్‌ను కొట్టి వేసింది. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. నోటిఫికేషన్‌ విడుదలైనందున పిటిషన్‌ విచారణార్హం కాదని అదనపు అడ్వకేట్ జనరల్‌ జే రామచంద్రరావు కోర్టుకు తెలిపారు.

మెజార్టీ సభ్యుల విశ్వాసం పొందిన వారు గెలుస్తారని, పోటీ చేసే అవకాశం అందరికీ ఉండాలన్నదే సొసైటీ ఉద్దేశమని సొసైటీ తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను సవాల్‌ చేయడం లేదని, నోటిఫికేషన్‌ కంటే ముందు ఇచ్చిన కోఆపరేటివ్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను మాత్రమే కొట్టేయాలని కోరుతున్నామని పిటిషనర్‌ తెలిపారు. అయితే పిటిషనర్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రొసీడింగ్స్‌ కొట్టేయాలన్న మధ్యంతర దరఖాస్తు కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read More:

నేడు ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవం.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు

అత్యధికశాతం ఓటింగ్‌ నమోదు కావాలి.. పట్టభద్రులు బద్దకం వీడి పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టాలి -మహ్మూద్‌ అలీ

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వెల్లువెత్తుతున్న మద్దతు.. మంత్రి హరీశ్‌రావుతో పలు అసోసియేషన్ల భేటీ