AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైంది.. ఆ ఘటనపై విచారణ జరిపించాలి.. నిర్మల్‌ కలెక్టర్‌కు మహిళా మోర్చా ఫిర్యాదు

నిర్మల్‌ జిల్లా భైంసాలో చెలరేగిన అల్లర్లు రాజకీయ రూపును సంతరించుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇరువర్గాల మద్య జరిగిన దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు..

తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైంది.. ఆ ఘటనపై విచారణ జరిపించాలి.. నిర్మల్‌ కలెక్టర్‌కు మహిళా మోర్చా ఫిర్యాదు
Mahila Morcha
K Sammaiah
|

Updated on: Mar 13, 2021 | 8:30 AM

Share

నిర్మల్‌ జిల్లా భైంసాలో చెలరేగిన అల్లర్లు రాజకీయ రూపును సంతరించుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇరువర్గాల మద్య జరిగిన దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే భైంసా ఒక వర్గం మరో వర్గంపై కక్షపూరితంగా దాడులు చేసిందని బీజేపీ ఆరోపిస్తుంది. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్న ఎంఐఎంప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని బీజేపీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల్‌లో పర్యటించారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి పేర్కొన్నారు. బైంసా అల్లర్లలో హిందువుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మీర్జాపూర్ లో చిన్నారిపై జరిగిన దారుణం పై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుకీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె భైంసాపట్టణంలో జరిగిన అల్లర్లలో అనేక మంది బాధితులు రోడ్లపై పడ్డారని, అందులో భాగంగా విలేకర్లు, పోలీసులు అని చూడకుండా విచక్షణ రహితంగా దాడులు చేస్తూ భయ భ్రాంతులకు గురి చేయడమే కాకుండా ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి కారకులయ్యారన్నారు.

ఎంఐఎం ప్రజా ప్రతినిధి సారథ్యంలో జరిగిన సంఘటనలు రాష్ట్ర ప్రజానీకాన్ని కుదిపేసిందని, దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయకుండా అమాయక ప్రజలపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఈ ఘటన మరిచిపోకముందే మిర్జాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి నాలుగు సంవత్సరాల బాలికపై అత్యాచారానికి ఒడిగడ్డటం రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. ఈ సంఘటన పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

భైంసాలో ఇంత అల్లర్లు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టిన లేకపోవడం చూస్తుంటే తెలంగాణలో ఉన్నామా మినీ పాకిస్తాన్ లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమంగా హిందువులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అత్యాచారానికి పాల్పడ్డ యువకునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More:

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై పిటిషనర్ కు చక్కెదురు.. పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

నేడు ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవం.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు