ఎన్నికల ఇంచార్జ్‌లతో మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్.. ఆ విషయంలో మంత్రి కీలక సూచనలు
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఇంతకాలం ప్రత్యక్ష ప్రచారం నిర్వహించిన పార్టీల నేతలు.. ఇప్పుడు ఇతర పద్దతుల్లో..
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఇంతకాలం ప్రత్యక్ష ప్రచారం నిర్వహించిన పార్టీల నేతలు.. ఇప్పుడు ఇతర పద్దతుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇంతకాలం ఓటర్లను ప్రత్యక్షంగా కలిసిన ఎన్నికల ఇంచార్జ్‌లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిలతో శుక్రవారం మంత్రి టి.హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
హలో నేను హరీష్ రావును.. మీరు ఎన్నికల ఇన్‌చార్జినా.. అంటూ ఫోన్‌లో పలకరించారు. ఎంత మంది ఓటర్లను కలిశారు.. ఎన్ని సార్లు కలిశారు.. టీఆర్‌ఎస్ బలపరిచిన వాణిదేవికి ఎంతమంది ఓటు వేస్తామంటున్నారు.. అని ఫోన్‌లో ఆరా తీశారు. మీరు పార్టీ కరపత్రం ఓటర్లకు ఇచ్చారా… అని అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఓటరును కనీసం మూడు సార్లు కలవాలని, పార్టీ కరపత్రాన్ని, ఓటరు స్లిప్పును అందజేయాలని ఎన్నికల ఇంచార్జిలకు మంత్రి హరీశ్ రావు సూచించారు. హరీష్‌రావు పక్కన ఎంపీ రంజిత్‌రెడ్డి ఉన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల పనితీరుపై హరీశ్‌రావు సంతృప్తి వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట మండలాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇన్‌చార్జిలతో మంత్రి హరీశ్‌రావు సెల్‌ఫోన్ ద్వారా ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బి.సాయిరెడ్డి, రాజేంద్రనగర్ పట్టణ పరిధిలోని వనం శ్రీరాంరెడ్డి, ధర్మారెడ్డి, మహేశ్‌లతో పాటు శంషాబాద్ మండలానికి చెందిన చంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితర ముఖ్య నేతలతో మంత్రి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా పరిధిలో మొత్తం ఓటర్లు ఎంతమంది.. మీరెంత మందిని కలిసి ఓట్లను అభ్యర్థించారు.. వారి స్పందన ఎలా ఉంది, ఇతర పార్టీల వారు కలిశారా? అంటూ నేతలతో మాట్లాడారు.
స్థానిక నాయకులు కలిసిన వారికి ఫోన్ చేసిన మంత్రి కాన్ఫరెన్స్‌లోనే పలుకరించారు. చివరగా స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌తో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రకాశ్ అన్నా.. మీ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు మంచిగా పనిచేస్తున్నారు.. గుడ్‌జాబ్.. వెల్డన్ అంటూ మంత్రి సంతృప్తిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆయా బూత్‌లలోని ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి ఓటింగ్‌శాతం పెంచేలా కృషిచేయాలని మంత్రి కోరారు.
Read More:
నేడు ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవం.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు