అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దూకుడు, 173 మంది అభ్యర్థులతో తొలి జాబితా, కొలతూర్ నుంచి స్టాలిన్, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ

Tamil Nadu Election 2021 : అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే దూకుడు ప్రదర్శిస్తోంది. 173 మంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌. ఇక, స్టాలిన్‌ కొలతూర్‌..

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దూకుడు,  173 మంది అభ్యర్థులతో తొలి జాబితా, కొలతూర్ నుంచి స్టాలిన్, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ
Dmk
Follow us

|

Updated on: Mar 12, 2021 | 4:13 PM

Tamil Nadu Election 2021 : అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే దూకుడు ప్రదర్శిస్తోంది. 173 మంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌. ఇక, స్టాలిన్‌ కొలతూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలినతి చెపాక్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరి లోకి దిగారు. ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో డీఎంకే అధిపతి ఓ ఇంటర్వ్యూను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్నసంగతి తెలిసిందే. పార్టీ వ్యవస్థాపకులు కరుణానిధి కాలంలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఆ సమయంలో కరుణానిధి బృందం ముందు స్టాలిన్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

ప్రస్తుతం కూడా డీఎంకేలో ఇదే ఆనవాయితీ నడుస్తోంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సమయంలోనే ఉదయనిధి స్టాలిన్‌ను పార్టీ పక్కన పెట్టిందని, ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. కానీ చివరకు ఉదయనిధి బరిలోకి నిలిచి వాటన్నిటికీ చరమగీతం పాడారు. మరోవైపు సీనియర్లకు మొదటి జాబితాలో చోటు దక్కింది. కే.ఎన్. నెహ్రూ త్రిచీ నుంచి, సెంథిల్ బాలాజీ కరూర్ నుంచి, టీఆర్‌బీ రాజా మన్నార్ గూడి నియోజకవర్గం నుంచి, తంగా తమిళ్ సెల్వన్ బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు స్టాలిన్ స్వయంగా ప్రకటించారు.

Read also : ఎన్నికలైపోయినా తగ్గని కాక.. ‘వైసీపీ మొత్తం డివిజన్లు గెలుచుకుంటే, రాజకీయాల నుంచేకాదు, విజయవాడ నుంచే వెళ్లిపోతా’