GIC Recruitment: డిగ్రీ, పీజీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం… ఎలా అప్లై చేసుకోవాలి.. చివరి తేది ఎప్పుడంటే..?

GIC Recruitment 2021: ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (GIC) తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ, జీపీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా స్కేల్‌ - 1 ఆఫీసర్‌ పోస్టులను...

GIC Recruitment: డిగ్రీ, పీజీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం... ఎలా అప్లై చేసుకోవాలి.. చివరి తేది ఎప్పుడంటే..?
Gic Job Notification
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 12, 2021 | 6:27 PM

GIC Recruitment 2021: ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (GIC) తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ, జీపీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా స్కేల్‌ – 1 ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. గురువారం నుంచి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుకు మార్చి 29ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తివివరాల కోసం https://www.gicofindia.com/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. సెలక్ట్‌ అయిన వారికి ముంబైలో పోస్టింగ్‌ ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు 01/02-2021 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి, 30 ఏళ్లు మించకూడదు. ఈ లెక్కన అభ్యర్థి 02-02-1991కి ముందు 01-02-2000 తర్వాత జన్మించి ఉండకూడదన్న మాట. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలంటే..

* ముందుగా GIC అధికారిక వెబ్‌సైట్‌ gicofindia.com.లోకి వెళ్లాలి.

* అనంతరం ఓపెన్‌ అయిన వెబ్‌ పేజీలో పైన ఉన్న ‘కెరీర్స్‌’లో GIC Assistant Manager Recruitment 2021 Notification లింక్‌ను క్లిక్ చేయాలి.

* నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చూసిన తర్వాత అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన విషయాలు..

* పరీక్ష ఫీజుగా రూ.850గా నిర్ణయించారు. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఉచితం)

* ఆన్‌లైన్‌ మోడ్‌లో జరగనున్న ఈ పరీక్షను 2021 మే 9న నిర్వహించనున్నారు.

* రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి ఎంపిక చేసుకుంటారు.

* ఇక వేతనం విషయానికొస్తే.. డీఏ, హెచ్‌ఆర్‌ఏ లాంటి అలవెన్సులు కలుపుకొని మొత్తం రూ.65,000 లభిస్తుంది.

* విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌, కరీంనగర్‌లో పరీక్షా కేంద్రాలుంటాయి.

* విద్యార్హతల విషయానికొస్తే.. సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్‌ చూడండి.

Also Read: FCI Recruitment 2021 : భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ .. అర్హత ఏమిటంటే..!

India Post GDS Recruitment 2021: గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఏప్రిల్‌ 7

Student Alerts: విద్యార్థులు అలర్ట్‌: ఈ సంవత్సరంలో ఏ విద్యార్థులకు ఎప్పుడు పరీక్షలు.. తేదీల వివరాలు ఇవే..