FCI Recruitment 2021 : భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ .. అర్హత ఏమిటంటే..!

నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్ రిలీజయింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...

FCI Recruitment 2021 : భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ..  అర్హత ఏమిటంటే..!
Fci Notification
Follow us

|

Updated on: Mar 12, 2021 | 4:53 PM

FCI Recruitment 2021 : నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్ రిలీజయింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈపోస్టులకు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఖాళీలు -89 వీటిని రెండు కేటగిరీలుగా విభజించారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మెడికల్ ఆఫీసర్ లకు దరఖాస్తులను కోరుతున్నారు.

1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు : 87

A. జనరల్ అడ్మినిస్ట్రేషన్ : 30

విద్యార్హతలు : సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల వయోపరిమితి

B. టెక్నికల్ : 27

విద్యార్హతలు : అగ్రికల్చర్ బీఎస్సీ, బి ఈ, బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ఈపోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 1/1/2021 నాటికి 28 సంవత్సరాలు దాటకూడదు.

C. అకౌంట్స్ : 22 విద్యార్హతలు : ఇనిస్ట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఐసిఏఐ లో మెంబర్ షిప్ కలిగి ఉండాలి. ఈపోస్దులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 01/01/2021 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

D. న్యాయవాది : 8 విద్యార్హతలు : ఫుల్ టైం లా డిగ్రీపట్టా పొంది ఉండాలి. అంతేకాదు న్యాయవాదిగా ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు 01/జనవరి 2021 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.

2. మెడికల్ ఆఫీసర్ : 2 విద్యార్హతలు : ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి . వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపిక విధానం : రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ కి షార్ట్ లిస్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపాల్సిన చివరి తేదీ 31 మార్చి. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ fci.gov.in ను చూడవచ్చు.

Also Read: