AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడు ఉన్నాడు అనేందుకు సాక్ష్యం.. ఆ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు, స్వేదం ఉంటాయట.. ఆక్షేత్రం ఎక్కడ వుందో తెలుసా

ఓ ప్రాంతంలో మాత్రం నరసింహుడు స్వయంభువుగా వెలిశాడని కథనం అంతేకాదు.. ఆ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు ఉంటాయట.. ఆ పుణ్యక్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఆ క్షేత్ర విశిష్టత ఏమిటి..?..

దేవుడు ఉన్నాడు అనేందుకు సాక్ష్యం.. ఆ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు, స్వేదం ఉంటాయట.. ఆక్షేత్రం ఎక్కడ వుందో తెలుసా
Sri Hemachala Narasimha Swa
Surya Kala
|

Updated on: Mar 12, 2021 | 3:35 PM

Share

Sri Hemachala Narasimha Sswamy : భారత దేశం ఆధ్యాత్మకతకు నెలవు. మానవ నిర్మితాలైన ఆలయాలు.. స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాలు అనేక మర్మాలను కలిగి ఉన్నాయి. ప్రకృతిపై మనిషి గెలిచాడు అని అంటారు.. కానీ నేటికీ ఎన్నో ఆలయాల్లోని రహస్యాలను తెలుసుకోవడం మాత్రం వీలుకావడం లేదు. ఇదంతా దేవుడు మహిమే అని నమ్మే భక్తులు అనేకం ఉన్నారు నేటికీ.. దశావతారాల్లో ఒకటి నరసింహావతారం. ఉగ్రస్వరూపుడు సింహం తల మనిషి శరీరం కలిగిన ఈ రూపంలో తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి అతని తండ్రి హిరణ్య కశ్యపుడిని సంచరించడానికి హిందువుల నమ్మకం. ఇక నరసింహస్వామికి మనదేశంలో అనేక ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. అయితే ఓ ప్రాంతంలో మాత్రం నరసింహుడు స్వయంభువుగా వెలిశాడని కథనం అంతేకాదు.. ఆ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు ఉంటాయట.. ఆపుణ్యక్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఆ క్షేత్ర విశిష్టత ఏమిటి..? ఎలా వెళ్ళాలి.. ? తెలుసుకుందాం..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మల్లూరు గ్రామందగ్గర అడవుల్లో కొలువై ఉన్నాడు హేమాచల నరసింహస్వామి. స్వామివారి దర్శనానికి పచ్చని అడవులను చెట్లను దాటుకుంటూ వెళ్ళాలి.. ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్టని అని స్థానికులు పిలుస్తారు..

ఈ ఆలయం ప్రత్యేకతలు :

మొల్లవీరత్ శ్రీ నరసింహ స్వామి ఎత్తు 10 అడుగుల వరకు ఉంది. ఈ ఆలయం వద్ద ఉన్న ద్వజస్థంభ దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయానికి సమీపంలో రాతితో కూడిన ఉగ్ర అంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయం దగ్గర నిరంతరం నీటి ప్రవాహం ఉంది, ఇక్కడ కొండల పైనుంచి ఉంటుంది. ఇక్కడ నరసింహడు శిలా జిత్తు రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. శిలను తాకితే చర్మం ఉన్నట్లు మెత్తగా తగులుతుంది. అంతేకాదు విగ్రహంలో నోరు, నుదురు మీసాలు, చెవులు, ముక్కు ఇలా అన్నీ స్పష్టంగా గుర్తించవచ్చు.. అంతేకాదు ఎక్కడ తాకినా సొట్టపడుతుంది. కాసేపటికి యధాస్థితి చేరుకుంది.. అంటే నరసింహ స్వామిని తాకితే మనిషిని తాకిన ఫీలింగ్ కలుగుతుందట. ఇక వెంట్రుకలు కూడా ఈ స్వామికి ఉంటాయి. ఆరోజు స్వామివారికి అభిషేకం చేసే సమయంలో వెంట్రుకలు రాలుతాయని స్వామివారిని అర్చించే పూజారులు చెబుతారు. ఇక నరసింహస్వామి వారి నాభి నుంచి నిత్యం స్వేదం వస్తుందట.. అందుకనే అక్కడ చందనం ఉంచుతారు.. ఈ చందాన్ని ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా పంచుతారు.. ఈ చందనం ప్రసాదంగా తీసుకున్నవారికి సంతానం కలుగుతుందని పూర్వకాలం నుంచి వస్తున్న భక్తుల విశ్వాసం.

స్థల పురాణం:

ఈ ప్రాంతాన్ని ఆరో శతాబ్దంలో దిలీప కులకర్ణి మహారాజు పాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నారట.. ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజ కలలో కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణంపం తన నాభికి తగిలిందని చెప్పారట. భూమిలోపల ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి భక్తుల సందర్శనార్ధం ఏర్పాటు చేయాలని సూచించారట స్వామివారు.. అక్కడ నరసింహం స్వామికి దిలీప మహారాజు ఓ ఆలయాన్ని నిర్మించాడు..

మహిమానిత్వం చింతామణి :

స్వామివారి పాదాలనుంచి నీటి ఊట ఎప్పుడూ పారుతూ ఉంటుంది.. దేనిని చింతామణి జలధారగా పిలుస్తారు.. జలధార. ఈ జలధార అన్ని కలల్లోనో ఒకే విధంగా ఉంటుంది. అయితే స్వామి వారి పాదల నుంచి కొంత దూరంలో ఉన్న జలధారకు నీరు ఎలా వచ్చి చేరుతుందనేది ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. అయితే ఈ నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తుల విశ్వాసం.. రుద్రమదేవి ఒకసారి తీవ్ర వ్యాధితో బాధపడుతుంటే రచవైద్యుల సూచనతో ఈ జలధార నీటిని తాగిందని అప్పుడు వ్యాధి నయం అయిందని ఇప్పటికీ వినిపించే ఓ కధనం. ఇప్పటికీ భక్తుల విశ్వాసం.. అంతేకాదు ఈ జలధారలోని నీటిని విదేశాల్లో ఉన్న తమవారికి పంపిస్తారు కూడా

స్వామివారి దర్శానికి ఎలా చేరుకోవాలంటే:

ఈ ఆలయం ఎటురునగరమ్-భద్రచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నెలలో ఇక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. అక్టోబర్-జూన్ సమయంలో ఈ ఆలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. భద్రాచలం నుండి హనుమకొండకు (ఎటురునగరం, మనుగురు ద్వారా)ఆర్టిసి బస్సులు ఉన్నాయి, వీటి ద్వారా భక్తులు మంగపేట చేరుకోవచ్చు మరియు అక్కడ నుండి ఆలయానికి చేరుకోవడానికి ఆటోలు ఉన్నాయి. మల్లూరుకు కొన్ని ప్రత్యక్ష బస్సులు ఉన్నాయి.

Also Read:

 ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్ విసురుతున్న నటుడు

 కలియుగ అధిపతి కలి ఉండే స్థానాలు ఏమిటో తెలుసా..! వాటిపై మోజు పడితే మనిషిజీవితం నాశనమే