- Telugu News Photo Gallery Spiritual photos King parikshit allowed kali yuga to destroy the world from these places on earth
Story of Kali And Parikshit : కలియుగ అధిపతి కలి ఉండే స్థానాలు ఏమిటో తెలుసా..! వాటిపై మోజు పడితే మనిషిజీవితం నాశనమే
హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి.. నాలుగవ యుగం ప్రస్తుతం నడుస్తుంది కలి యుగం. ఈ యుగ కాల పరిమాణం 432000ఏళ్ళు. కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభంయ్యిందని హిందువుల నమ్మకం. ఈ యుగంలో నడిచేది అంతా అధర్మమే. అంతా అన్యాయమే. ఇప్పుడున్న కలియుగంలో కలి ప్రభావం అసలు ఎప్పుడు మొదలైందో, కలి ఎక్కడెక్కడ ఉంటాడో, ఎలా మనల్ని నాశనం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం...
Updated on: Mar 12, 2021 | 4:53 PM

Kali Yugaకృష్ణుడు మరణం తర్వాత ద్వాపరయుగాంత కాలంలో అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడే కలి పురుషుడు. ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి.. కలియుగం ప్రారంభమవుతున్న దశలో పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు. అయితే కలి తన ప్రభావం ముందుగా సాధుజంతువులపై చూపించడం మొదలు పెట్టాడు.

Pariskhsit Maharaఒకరోజున పరీక్షిత్ మహారాజుకు గోమాత ఏడుపు వినిపిస్తుంది. వెంటనే ఆవు వెళ్లిన పరీక్షిత్తుడు ఆవు కాలు లేకపోవడం గమనిస్తాడు.. ఎందుకు ఎం జరిగిందని ఆవును ప్రశ్నిస్తాడు.. వెంటనే తన కాలును కలి నరికేశాడని చెబుతుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పరీక్షిత్తు కలిని పట్టుకుని బంధిస్తాడు. కలిని ఆవుని ఏడిపించినందుకు అనుభవించు అంటూ చిత్రవధకు గురిచేస్తాడు ja And Cow

Kali Liveపరీక్షిత్ మహారాజు పెడుతున్న హింసను తట్టుకోలేని కలి.. ఎందుకు నన్ను ఇలా బంధించి కొడుతున్నావు నాయి అడుగుతాడు.. నువ్వు ఆవు పట్ల చేసిన పాపానికి ఇది శిక్ష అంటాడు.. అయితే ఇది కలియుగం.. కనుక తాను ప్రవేశించినట్లు.. ఏమైనా చేసే హక్కుతనకు ఉండదని కలి చెబుతాడు. అయితే కలి మాటలకు పరీక్షిత్తుడు అంగీకరించాడు.. అయితే అప్పుడు కలి ఒక నిబంధన పెడతాడు. తాను ఉండే చోటుకు ప్రజలు రాకుండా ఉంటె వారిని ఏమీ చేయనని చెబుతాడు.. కలి షరత్ కు పరీక్షిత్తుడు అంగీకరిస్తాడు. s

కలి ఉండే స్థానాలను తననే చెప్పమని అడుగుతాడు పరీక్షితుడు.మద్యపానం, జూదశాల, వ్యభిచారం, జీవహింస జరిగే ప్రాంతాలలో తాను ఉంటానని కలి చెబుతాడు. ఇందులో భాగంగా వ్యభిచారం నుంచి వచ్చే కామము, మద్యపానం నుంచి వచ్చే మదం, జూదశాల నుంచి వచ్చే అసత్యం, అహంకారం, హింస నుంచి వచ్చే కోపం, క్రౌర్యంల్లోనూ తనకు చోటు ఉంటుందని కలి చెబుతాడు.

కలి జూదం, మద్యం వంటి వాటితో పాటు నెమ్మదిగా బంగారంలోను స్థానం సంపాదించుకున్నాడు. బంగారం నుంచి పుట్టే మాత్సర్యం లో కూడా కలి చేరడానికి వీలు సంపాదించుకున్నాడు.. దీంతో తనకు ఈ 9స్థానాలు చెందుతాయని.. ఈ ప్లేస్ లో ఉండే వారిని కలి పట్టిపీడిస్తాడని పురాణాల కథనం

కలి బంధించిన పరీక్షిత్తు కూడా కలి ప్రభావంతో మరణిస్తాడు. మహారాజు ధరించే బంగారు ఆభరణాల్లో ప్రవేశించిన కలి ప్రభావంతో మాత్సర్యం పీడితుడై ఓ ముని శాపానికి గురై పాము కాటుతో పరీక్షిత్తుడు మరణిస్తాడు. దీంతో పూర్తిగా కలియుగానికి కలి అధిపతి అయ్యాడు. అందుకనే ఆ తొమ్మిందిటికి మనుషులు దూరంగా ఉంటే కలి ప్రభావం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని ఓ నమ్మకం




