AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ సర్కార్ పెన్షన్ స్కీం.. నెలకు రూ. 3 వేలు పెన్షన్ పొందండి.. నమోదు చేసుకోండిలా.!

Modi Government: పేదలు, వృద్దులకు లబ్ది చేకూరేలా, వారికి ఆర్ధికంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వం పలు రకాల పధకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

మోదీ సర్కార్ పెన్షన్ స్కీం.. నెలకు రూ. 3 వేలు పెన్షన్ పొందండి.. నమోదు చేసుకోండిలా.!
Pm Scheme
Ravi Kiran
|

Updated on: Mar 13, 2021 | 1:23 PM

Share

Modi Government: పేదలు, వృద్దులకు లబ్ది చేకూరేలా, వారికి ఆర్ధికంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వం పలు రకాల పధకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పధకాల్లో ఒకటే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (పీఎం-ఎస్‌వైఎం). ఈ పధకం ద్వారా కేంద్రం పేదలు, వృద్దులకు నెలకు రూ. 3000 చొప్పున సాయం అందించనుంది. ఇప్పటికే ఈ పధకం కింద దేశవ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇంతకీ ఆ పధకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పేదలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ”ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మన్-ధన్ యోజన” అనే పధకాన్ని 2019వ సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పధకం కింద అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీస రూ .3000 పెన్షన్ ఇవ్వనుంది. అసంఘిటిత రంగంలో పనిచేసే వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే ఈ పధకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద, 2021 మార్చి 4 నాటికి సుమారు 44.90 లక్షల మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 18- 40 సంవత్సరాల వయస్సు ఉన్న కార్మికులు ఈ పధకానికి అర్హులు కాగా.. వారి నెలసరి జీతం రూ.15,000 కన్నా తక్కువ ఉండాలి.

పెన్షన్ ఎంత వస్తుందంటే..?

”ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మన్-ధన్ యోజన”(పిఎం-ఎస్వైఎం) పథకం కింద నెలకు రూ .55 నుంచి 200 రూపాయల వరకు జమ చేయవచ్చు. ఇందులో 18 ఏళ్లు నిండిన వారు నెలకు రూ .55, 30 ఏళ్లు నిండిన వారు రూ .100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 40 ఏళ్లు నిండిన వారు నెలకు రూ .200 చెల్లించాలి.

ఉదాహరణకు ఓ కార్మికుడు 18 సంవత్సరాల వయస్సులో PM-SYM పథకంలో తన పేరును నమోదు చేసుకుంటే.. అతను సంవత్సరానికి రూ. 660 జమ చేయాల్సి ఉంటుంది. అంటే 60 ఏళ్లు వచ్చే వరకు రూ. 27,720 పెట్టుబడి పెట్టాలి. ఇక ఆ తర్వాత అతడికి ప్రతీ నెలా రూ 3 వేలు పెన్షన్ లభిస్తుంది. ఈ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ద్వారా నిర్వహిస్తోంది, అందువల్ల ఎల్ఐసి కూడా పెన్షన్ చెల్లిస్తుంది.

నమోదు చేసుకోండిలా…

ప్రధాన్ మంత్రి శ్రామయోగి మంధన్ పెన్షన్ యోజనలో రిజిస్ట్రేషన్ కోసం కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి సెంటర్)ను సంప్రదించాలి. వారి వెంట తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్‌ను తీసుకెళ్ళాలి. ఇక పిఎం-ఎస్వైఎం కింద ఖాతా తెరిచిన తరువాత, కార్మికుడికి శ్రామ్ యోగి కార్డు ఇవ్వబడుతుంది. కాగా, ఈ పథకం గురించి మరింత సమాచారం కొరకు హెల్ప్‌లైన్ నంబర్ 1800-267-6888ను సంప్రదించవచ్చు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!