AP Municipal Elections 2021: కృష్ణ జిల్లా పెడన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన బోణీ..
AP Municipal Elections 2021: ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో అధిక శాతం వైసీపీ అభ్యర్థులు...
AP Municipal Elections 2021: ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో అధిక శాతం వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పటికే చాలా మున్సిపల్ ఫలితాలు రాగా, మరి కొన్ని మున్సిపాలిటీల ఫలితాలు రావాల్సి ఉంది. ఇక కృష్ణ జిల్లా పెడన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు బోణీ కొట్టాయి. పెడమ మున్సిపల్ ఎన్నికల రెండో రౌండ్ కౌంటింగ్‌లో టీడీపీ 1, జనసేన 1 బోణీ కొట్టింది. 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి గరిక ముక్కుబాబు, 10వ వార్డులో వైసీపీ అభ్యర్థి బయల పాటి జ్యోతి, 11వ వార్డులో వైసీపీ అభ్యర్థి మల్లకోటమ్మ విజయం సాధించారు.
ఇక 12వ వార్డులో జనసేన అభ్యర్థి మట్ట శివ పావని 154 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 13వ వార్డులో వైసీపీ అభ్యర్థి తిప్ప లక్ష్మీ నరసమ్మ గెలుపొందారు. 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి హనుమల నామల్లేశ్వరమ్మ 157 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే 15 వార్డులో వైసీపీఅప్సర జహ, 16వ వార్డులో వైసీపీ అభ్యర్థి రిజర్వానా బేగం గెలుపొందారు.