AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadipatri Municipality: ఊరి మంచి కోసం జగన్‌ను కలిసేందుకు సిద్దం.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ ఉనికి చాటుకుంది. మొత్తం 36 వార్డుల్లో 18 టీడీపీ గెలుచుకున్నట్లు సమాచారం అందుతుంది.

Tadipatri Municipality: ఊరి మంచి కోసం జగన్‌ను కలిసేందుకు సిద్దం.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Jc Prabhakar Reddy
Ram Naramaneni
|

Updated on: Mar 14, 2021 | 4:50 PM

Share

Jc Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ ఉనికి చాటుకుంది. మొత్తం 36 వార్డుల్లో 18 టీడీపీ గెలుచుకున్నట్లు సమాచారం అందుతుంది. 16 వార్డుల్లో వైసీపీ గెలిచింది. రెండు చోట్ల ఇతరులు గెలిచారు. కాగా 24వ వార్డు నుంచి బరిలోకి దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు.ఇది తాడిపత్రి ప్రజల విజయమని వ్యాఖ్యానించారు జేసీ.. సేవ్ తాడిపత్రి నినాదం బాగా పనిచేసిందన్నారు.

స్పష్టమైన ఆధిక్యంరాని నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులతో కలిసి ఆయన క్యాంప్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో తాడిపత్రిలో రాజకీయాలు వేడెక్కాయి. కాగా తాడిపత్రిలో ఎన్నికల ఫలితాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఊరి మంచి కోసం అవసరమైతే సీఎం జగన్‌ను కూడా కలుస్తామన్నారు. వైసీపీ గెలిచిన నలుగురు అభ్యర్థులు టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. నాయకులు భయంతో ఏసీ రూముల్లో కూర్చున్నారని, కార్యకర్తల కృషి వల్లే విజయం సాధ్యమైందని ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధినేత చంద్రబాబు ఇప్పటికైనా నాయకుల్ని మార్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  ఇక నుంచి ప్రజలతో మమేకం అవుతానని.. తాడిపత్రిని రక్షించుకుంటానన చెప్పారు.

Also Read:

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం

ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల గురించి ఫిర్యాదు అందిందే 48 గంటల్లో పరిష్కారం.. వాలంటీర్లకు కీలక బాధ్యతలు