Gold Illegal Smuggling: ఎంత క్రియేటివిటి..! ఇవే తెలివితేటలు బాగుపడటానికి ఉపయోగించరు

విమానాల ద్వారా ఇండియాకు బంగారం అక్రమంగా దిగుమతి అవుతోంది. కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ, విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా...

Gold Illegal Smuggling: ఎంత క్రియేటివిటి..! ఇవే తెలివితేటలు బాగుపడటానికి ఉపయోగించరు
Gold Illegal Smuggling
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 15, 2021 | 9:18 AM

Gold Illegal Smuggling: విమానాల ద్వారా ఇండియాకు బంగారం అక్రమంగా దిగుమతి అవుతోంది. కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ, విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు అక్రమార్కులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ, ఇన్నీ కాదు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం పట్టుబడింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఐదుగురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 47.67 లక్షల విలువ గల కిలో పైగా గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు.

షార్జా నుంచి విమానంలో శంషాబాద్‌కు ఓ ప్యాసింజర్ వచ్చాడు. తాను ధరించిన చెప్పులకు అడుగు భాగంలో గోల్డ్‌ని పేస్టు రూపంలో అతికించి తరలిస్తుండగా.. అతడి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగింది. అదుపులోకి తనిఖీ చేయగా గుట్ట రట్టయ్యింది. అతని వద్ద నుంచి 27 లక్షల విలువ చేసే 672 గ్రాముల బంగారం పేస్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే షార్జా నుంచి మరో విమానంలో శంషాబాద్‌కు నలుగురు ప్రయాణికులు చేరుకున్నారు. వారి వద్ద 20 లక్షలు విలువ చేసే 471 గ్రాముల గోల్డ్ బిస్కెట్స్, ఉంగరాన్ని నోట్లో పెట్టుకొని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు అదుపులకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.

ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు. కోకొల్లలు. కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. మరింత మెరుగైన టెక్నాలజీ వస్తే కానీ.. ఈ తరహా స్మగ్లింగ్స్‌కు అడ్డుకట్ట పడదేమో.

Also Read:

బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది

కామారెడ్డి జిల్లాలో మడ్ బాత్… పుట్టమన్ను దంచి, జల్లెడ పట్టి.. గులాబీ రేకులు, గోమూత్రం, గోపేడ కలిపి‌

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?