Petrol Price Today: పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం.. స్థిరంగా కొనసాగుతోన్న ధరలు..

Petrol Price Today: కొన్నిరోజులుగా పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లుగా దూసుకుపోతున్న ఇంధన ధరలకు గడిచిన కొన్ని రోజులుగా బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. అయితే భారీగా ధరలు తగ్గకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం..

Petrol Price Today: పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం.. స్థిరంగా కొనసాగుతోన్న ధరలు..
Petrol Price Today
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2021 | 1:19 PM

Petrol Price Today: కొన్నిరోజులుగా పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లుగా దూసుకుపోతున్న ఇంధన ధరలకు గడిచిన కొన్ని రోజులుగా బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. అయితే భారీగా ధరలు తగ్గకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం చెక్‌ పడింది. సోమవారం కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఆదివారంతో పోల్చితే స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి ఈ రోజు ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

ఢిల్లీలో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా ( ఆదివారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (ఆదివారం  రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (ఆదివారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (ఆదివారం రూ.88.60 )గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (ఆదివారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (ఆదివారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం కరీంనగర్‌లో మాత్రం ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.91 (ఆదివారం రూ. 94.67 ), డీజిల్‌ రూ. 88.96 (ఆదివారం రూ. 88.73 )గా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.28 (ఆదివారం రూ.97.26), డీజిల్‌ ధర రూ. 90.79 (ఆదివారం రూ.90.72) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.13 (ఆదివారం రూ. 96.26 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 89.69 (ఆదివారం రూ.89.81 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా (ఆదివారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.45 (ఆదివారం రూ. 86.51 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (ఆదివారం  రూ. 94.29 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (ఆదివారం రూ. 86.42 ) గా ఉంది.

Also Read: Stock Rallied: రూ.లక్ష పెట్టుబడి పెడితే.. నాలుగు నెలల్లో రూ. 75 లక్షలు.. పంటపండటమంటే ఇదే మరి..!

Air travel: అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్‌

Cylinder Booking: గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా.? అయితే ఇలా చేయండి.. రూ.50 క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు..