Mydukur Mayor: మైదుకూరు జనం ఎవరిని ఓడించారు..? ఎవరి గెలిపించారు..? మరి పీఠం ఎక్కేది ఎవరు..?

mydukur municipality: అనుకున్నట్టే జరుగుతోంది… మైదుకూరు టీడీపీ చేజారిపోతున్నట్టే కనిపిస్తోంది. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ 12 చోట్ల విజయం సాధిస్తే... 11 చోట్ల వైసీపీ క్యాండిడేట్స్‌..

Mydukur Mayor: మైదుకూరు జనం ఎవరిని ఓడించారు..? ఎవరి గెలిపించారు..? మరి పీఠం ఎక్కేది ఎవరు..?
Mydukur Municipality
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 15, 2021 | 12:37 PM

Mydukur Municipality Mayor: అనుకున్నట్టే జరుగుతోంది… మైదుకూరు టీడీపీ చేజారిపోతున్నట్టే కనిపిస్తోంది. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ 12 చోట్ల విజయం సాధిస్తే… 11 చోట్ల వైసీపీ క్యాండిడేట్స్‌ గెలిచారు. జనసేనకు ఒక వార్డు లభించింది. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు.. అధికార పార్టీకి ఒక్క సీటే తక్కువైంది.

మేయర్‌ కుర్చీలో కూర్తొనేది ఎవరు… సీటు ఎవరికి… స్వీటు ఎవరికి… ఇదే చర్చ ఇప్పుడు వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది. లాండ్‌స్లైడ్‌ విక్టరీతో చాలా మంది మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అసంతృప్తుల్లేకుండా లోకల్ లీడర్లతో డిస్కష్‌ చేసి మేయర్ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. మరోవైపు టీడీపీ సతాయిస్తున్న ఆ రెండు మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునే పనిలో బిజీగా ఉంది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దాదాపు అన్నీ ఫ్యాన్ కిందకు వచ్చేశాయి. రెండు చోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో వైసీపీది ఒకటే దూకుడు. ఇంత వరకు బాగానే ఉన్నా… ఇప్పుడు ఛైర్మన్‌ సీటు కోసం పాట్లు మొదలయ్యాయి. ప్రత్యర్థి పార్టీతో పోటీ పడి నెగ్గిన వారంతా… ఇప్పుడు సొంతపార్టీ నేతలతో పోరాడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడం హాట్‌ టాపిక్ అవుతోంది. ఎవరి వర్గంతో వాళ్లు క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేశారు.

వైసీపీలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది మొదట జంగారెడ్డి గూడెం. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 25వార్డుల్లో విజయం సాధించింది వైసీపీ. ఇదే ఇప్పుడు అక్కడ అసలు రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి విజయం సాధించిన ఎమ్మెల్యే ఎలిజా, ఎంపీ కోటగిరి శ్రీధర్‌… ఛైర్మన్‌ పదవి కోసం పోటీ పడుతున్నారు.

ఇప్పటికే తన వర్గం వార్డు సభ్యులను రహస్య ప్రదేశానికి పంపేశారు ఎమ్మెల్యే ఎలిజా. వారిని అరకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సహా వార్డు సభ్యులంతా ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశారు. దీంతో వార్డు సభ్యుల కుటుంబాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. తమ వారు ఎక్కడ ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Masiero Naked Protests: అవార్డుల పండగ వేడుకలో నిరసన గళం.. బట్టలు విప్పేసిన ఉత్తమ నటి..

Corona Cases India: మళ్లీ కరోనా విజృంభణ.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. వణుకుతున్న మహారాష్ట్ర