AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రైతులు పేదవారవుతుంటే ప్రభుత్వ అధికారులు ధనవంతులవుతున్నారు’, మేఘాలయ గవర్నర్ వ్యాఖ్య

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలను సమర్థిస్తూ మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ వ్యాఖ్యలు చేయడం విశేషం. రైతులు  పండిస్తున్న పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇఛ్చి...

'రైతులు పేదవారవుతుంటే ప్రభుత్వ అధికారులు ధనవంతులవుతున్నారు', మేఘాలయ గవర్నర్ వ్యాఖ్య
Farmers Are Getting Poorer Says Meghalaya Governor Satya Pal Malik
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 15, 2021 | 1:06 PM

Share

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలను సమర్థిస్తూ మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ వ్యాఖ్యలు చేయడం విశేషం. రైతులు  పండిస్తున్న పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇఛ్చి దానికి లీగల్ గ్యారంటీ ఇచ్చిన పక్షంలో అన్నదాతలు శాంతిస్తారని ఆయన అన్నారు. వీరిని ఇంకా బాధ పెట్టవద్దని ఆయన ప్రధాని మోదీని, హోమ్ మంత్రి అమిత్ షాను కోరారు. తన సొంత జిల్లా బాగ్ పట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ  దేశంలో రైతులు పేదలవుతుంటే..అధికారులు మాత్రం కుబేరులవుతున్నారని వ్యాఖ్యానించారు. రైతులపై బలప్రయోగం జరపవద్దని, ఢిల్లీ నుంచి వారిని వట్టి చేతులతో పంపరాదని తను ప్రధానిని, హోమ్ మంత్రిని కోరానన్నారు. వ్యవసాయ చట్టాల్లో ఒక్కటి కూడా అన్నదాతలకు అనుకూలంగా లేదని, రైతులు, సైనికులు సంతృప్తి చెందకపోతే ఈ దేశం పురోగమించజాలదని సత్య పాల్ మాలిక్ పేర్కొన్నారు.అందువల్ల వీరి బాగోగుల పట్ల శ్రద్ధ వహించాలని, వారు సంతృప్తిగా ఉండేలా చూడలని ఆయన ముఖ్యంగా అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.

రోజురోజుకూ రైతులు  పేదలవుతున్నారు.. కానీ ప్రభుత్వ అధికారులు, ఇతర సిబ్బంది వేతనాలు ప్రతి మూడేళ్లకు పెరుగుతున్నాయి .. అన్నదాతలు పంటలు పండిస్తుంటే అది చౌకగా ఉండగా..వారు కొనుగోలు చేసేది మాత్రం  ఖరీదైనదిగా ఉంటోందని ఆయన అన్నారు.తాము ఎలా పేదవారిగా మారుతున్నామో వారికి తెలియడంలేదని, వారు విత్తనాలు నాటుతున్నప్పుడు కొంత ధర వస్తోందని, ఆ తరువాత వాటి ఫలితాలు పొందేటప్పుడు అది 300 రెట్లు పెరుగుతోందని సత్య పాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. అన్నదాతలు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చునన్న కేంద్ర వాదనను ఆయన అపహాస్యం చేశారు.  ఒక రైతుమథుర నుంచి పాల్వాల్ కు తన గోధుమ పంటను విక్రయించడానికి వెళ్తే అతనిపై లాఠీ ఛార్జ్ జరుగుతుందని, మరొకరు సోనేపట్ నుంచి నాదెలాకు వెళ్తే అతనిపై కూడా ఇదే జరుగుతుందని సత్య పాల్ మాలిక్ అన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోగలరా ?ట్రై చేయండి..ఈ ఫన్నీ వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి.:Funny Video ఒక్క ఫోన్‌కాల్… అడ్డంగా బుక్కైన యువతి ఇంత సులభంగా అంత మోసం.: woman Loss 6.4 Lakhs Video.

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే