Sweet Corn Bonda Recipe : రెగ్యులర్ స్నాక్స్ తో బోర్ కొట్టిందా.. స్వీట్ కార్న్ తో స్నాక్స్ కు ట్రై చేస్తే సరి

మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా చౌకగా లభించే.. ఒకమంచి బలమైన ఆహార పదార్ధం.. దీని గింజలను పచ్చిగా కొంతమంది తింటే.. ఉడకబెట్టుకుని, కాల్చుకుని కొంతమంది తింటారు. ఇక మొక్కజొన్న...

Sweet Corn Bonda Recipe : రెగ్యులర్ స్నాక్స్ తో బోర్ కొట్టిందా.. స్వీట్ కార్న్ తో స్నాక్స్ కు ట్రై చేస్తే సరి
Sweet Corn Bonda
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2021 | 12:30 PM

Sweet Corn Bonda Recipe : మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా చౌకగా లభించే.. ఒకమంచి బలమైన ఆహార పదార్ధం.. దీని గింజలను పచ్చిగా కొంతమంది తింటే.. ఉడకబెట్టుకుని, కాల్చుకుని కొంతమంది తింటారు. ఇక మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ ఫ్లేక్స్’ తయారుచేస్తారు. లేత ‘బేబీకార్న్’ జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. అయితే ఈ మొక్కజొన్న గింజలతో మంచి స్నాక్ ఐటెం కూడా చేసుకోవచ్చు.. ఈరోజు సాయంత్రం స్నాక్స్.. స్వీట్ కార్న్ బోండా తయారీ విధానం తెలుసుకుందాం..!

స్వీట్ కార్న్ బోండా తయారీకి కావలసిన పదార్థాలు:

స్వీట్ కార్న్ గింజలు : 2 పెద్ద కప్పులు ( 2 మొక్క జొన్న పొత్తులు) శెనగపిండి : 1 కప్పు బియ్యం పిండి : 1/2 కప్పు ఉల్లిపాయలు : 2 (చిన్న ముక్కలు) పచ్చిమిర్చి : 6 (,చిన్న ముక్కలు) కొత్తిమీర :1 కట్ట పుదీనా : 1 కట్ట అల్లం వెల్లుల్లి ముద్ద : 1 స్పూన్ గరం మసాల : 1 స్పూన్ కారం : 1 స్పూన్ ఉప్పు : రుచికి తగినంత నూనె : వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

స్వీట్ కార్న్ గింజల్ని బాగా మెత్తగా కాకుండా, కొంచెం పలుకులుగా మిక్సీ వేసుకోవాలి. ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలతో పాటు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకుని కలుపుకోవాలి.. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాల, కారం, ఉప్పు వేసుకుని బాగా కలిపి టెస్ట్ చూసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. (ఇందులో నీరు వేయకూడదు)

ఇంతలో శనగపిండి బియ్యంపిండి కొంచెం కారం ఉప్పు కలిపి కలిపి బోండా వేయడానికి తోపు రెడీ చేసుకోవాలి. అనంతరం గ్యాస్ స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. దానిలో బొండాలు వేయించడానికి సరిపడరా నూనె వెయ్యాలి.. నూనె వేడి ఎక్కిన తర్వాత స్వీట్ కార్న్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని శనగపిండి లో ముంచి నూనెలో వేయాలి. మీడియం మంటపై బొండాలు వేయించి .. గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత టిస్యూ మీద తీసుకోవాలి.. నూనె ఉంటె అవి పీల్చుకుంటాయి. ఈ స్వీట్ కార్న్ బొండాలు వేడిగా తింటే చాలా బాగుంటాయి. వీటికి కాంబినేషన్ గా అల్లం పచ్చడి.. లేదా టమోటో సాస్ ఉంటె ఆహా ఏమి రుచి అంటారు..

గమనిక : స్టఫింగ్ పెట్టుకునే స్వీట్ కార్న్ ని ఉండలుగా గట్టిగా చుట్టుకోవాలి. లేకపోతే వేయించేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. అంతేకాదు ఉండలు పెద్దగా ఉండకూడదు.. ఇక మంట కూడా పెద్దదిగా పెట్టకూడదు.

Also Read:

మళ్లీ కరోనా విజృంభణ.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. వణుకుతున్న మహారాష్ట్ర

కరోనా టైమ్, ఎవరు మీలో కోటీశ్వర్లు షోలో ప్రేక్షకులుంటారా..? సమాధానం ఆయన మాటల్లోనే

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.