Evaru Meelo Koteeswarulu : కరోనా టైమ్, ఎవరు మీలో కోటీశ్వర్లు షోలో ప్రేక్షకులుంటారా..? సమాధానం ఆయన మాటల్లోనే

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ బుల్లి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ చేయనున్నారు.. ఈ విషయాన్నీ తెలియజేస్తూ....

Evaru Meelo Koteeswarulu : కరోనా టైమ్, ఎవరు మీలో కోటీశ్వర్లు షోలో ప్రేక్షకులుంటారా..? సమాధానం ఆయన మాటల్లోనే
Meelo Evaru Koteeswarudu
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2021 | 3:25 PM

Evaru Meelo Koteeswarulu :  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ బుల్లి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరు మీలో కోటీశ్వర్లు షో కి హోస్ట్ చేయనున్నారు.. ఈ విషయాన్నీ తెలియజేస్తూ.. మీడియా సమావేశాన్ని ఒక హోటల్ లో ఏర్పాటు చేశారు.. షో నిర్వాహకులు. ఈ సందర్భంగా తారక్ పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. తన రాజకీయ ప్రవేశం సహా కరోనా వంటి అనేక విషయాలపై ఎన్టీఆర్ మీడియా ముఖంగా సమాధానం చెప్పి.. అభిమానులను మరోసారి అలరించారు. కరోనా వైరస్ భయం మధ్య ఇటీవల తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది.. ఇక బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న హిందీ షో కౌన్ బనేగా కరోర్ పతి చిత్రీకరణ సమయంలో లైవ్ లో ప్రేక్షకులను తప్పించారు.. మరి మీ షో ఎలా ఉండనుంది.. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ రకరకాలుగా తన ఉనికి చాటుకుంటుంది.. దీంతో మీరు హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వర్లు షో ఎలా చిత్రీకరణ జరుపుకుంటుంది.. ప్రేక్షకులు ఉంటారా అని అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మీరు (మీడియా సిబ్బంది) ఇక్కడ ఉన్నట్లే, షో షూటింగ్ సమయంలో కూడా ప్రత్యక్ష ప్రేక్షకులు ఉంటారు. కరోనా ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతుందా అని చెప్పారు.

బిగ్ బాస్ షో తర్వాత మళ్ళీ బుల్లి తెరపైకి తిరిగి వస్తున్నా.. ప్రజలను కలవడానికి, వారు చెప్పింది వినడానికి, అంతేకాదు ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి, ప్రతి ఒక్కరి జీవితంలో అనేక కాంక్షలు, ఆకాంక్షలు ఉంటాయి వాటిని పంచుకోవడానికి.. వారి జీవితంలో ఎదిగిన విధానం తెలుసుకోవడానికి నాకు ఇదొక మంచి అవకాశం అని చెప్పారు ఎన్టీఆర్.

నాకు ఈ షో ద్వారా ఎంత డబ్బు వస్తుందని కాదు.. ఎంత విశ్వాసం సంపాదిస్తున్నా అన్నదే ముఖ్యం. జీవితాన్ని ప్రతి క్షణం ముందుకు సాగాలంటే విశ్వాసం ముఖ్యం. నేను అందరితోనూ కలిసి ఉత్తేజకరమైన ప్రయాణం చేయాలనీ భావిస్తున్నాను.. అందుకోసం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పారు ఎన్టీఆర్. త్వరలో ఎవరు మీలో కోటీశ్వర్లు  షో ద్వారా ఎన్టీఆర్ బుల్లి తెర ప్రేక్షకులను పలకరించనున్నారు.

Also Read:

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది: గవర్నర్‌ తమిళిసై ‌

మయన్మార్ లో చైనీస్ ఫ్యాక్టరీలకు నిప్పు, దుండగుల కాల్పుల్లో అనేక మంది మృతి, పలువురికి గాయాలు