AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు చేలో కూలి పనులు.. ఇప్పుడు గాల్లో ప్రయాణాలు.. గంగవ్వ ప్రస్థానం ఎందరికో ఆదర్శం..

గంగవ్వ తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. కూలీ పనులు చేసుకుంటూ.. ఊరు దాటి బయటకు వెళ్లడం తెలియని ఆమెను యూట్యూబ్ ఓ స్టార్‏గా మార్చేసింది.

ఒకప్పుడు చేలో కూలి పనులు.. ఇప్పుడు గాల్లో ప్రయాణాలు.. గంగవ్వ ప్రస్థానం ఎందరికో ఆదర్శం..
Gangavva
Rajitha Chanti
| Edited By: Team Veegam|

Updated on: Mar 15, 2021 | 6:57 PM

Share

గంగవ్వ తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. కూలీ పనులు చేసుకుంటూ.. ఊరు దాటి బయటకు వెళ్లడం తెలియని ఆమెను యూట్యూబ్ ఓ స్టార్‏గా మార్చేసింది. మై విలేజ్ షో ద్వారా ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అచ్చ తెలంగాణ యాసతో జనాన్ని ఆకట్టుకుంటూ.. తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతిరూపంగా కనిపిస్తుంది గంగవ్వ. అక్షరం ముక్క కూడా రాని గంగవ్వకు సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె బాష.. మాటతీరే తనను బిగ్‏బాస్ లాంటి రియల్ షోలోకి వెళ్లేలా చేసింది. బిగ్ బాస్ సీజన్ 4లో పరిచయంలేని వాళ్ళను తీసుకురాగానే షో మీద విమర్శలు వెలువడే తరుణంలో కేవలం గంగవ్వ పార్టిసిపేట్ చేయడం వలన రేటింగ్ పరంగా దూసుకెళ్లిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. షోలోకి అడుగుపెట్టిన నాటి నుంచి గంగవ్వ తన ఆట తీరుతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. కానీ మట్టివాసన.. ఊర్లో ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉండే గంగవ్వ ఒకే దగ్గర కట్టేసినట్లు ఉండే బిగ్ బాస్ షోలో ఉండలేకపోయింది. దీంతో నాలుగు వారాలు నెట్టుకోచ్చిన గంగవ్వ.. ఐదవ వారంలో స్వయంగా బయటకు వచ్చేసింది.

ఇక ఆ తర్వాత మళ్లీ యూట్యూబ్ వీడియోలలో నటిస్తూ వచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన వారందరితో తిరిగి వీడియోలను క్రియేట్ చేస్తూ వచ్చింది. ఇటీవలే తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్న గంగవ్వ.. తాజాగా మరో వీడియోను షేర్ చేసుకుంది. తాజాగా గంగవ్వ హెలికాఫ్టర్ ఎక్కిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. హెలికాఫ్టర్ ఎక్కి తన ఊరి పొలాలు, ఇళ్ళు, పరిసర ప్రాంతాలను చూసింది. మొదటి సారి హెలికాఫ్టర్ ఎక్కిన అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది గంగవ్వ. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నువ్వు గ్రేట్ అవ్వ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలను దిగమింగిన గంగవ్వ యూట్యూబ్ మహిమతో తాను ఎప్పుడు అనుకోని కూడా ఉండని హెలికాఫ్టర్ కూడా ఎక్కింది.

Also Read: మొదటి సినిమాతోనే బంపర్ ఆఫర్ అందుకున్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్… మాస్ మాహారాజా సరసన ఫరియా..

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు.. ఎందుకంటే..!

బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది