AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. బాధ్యతలు తీసుకుంటున్న తారక్.. త్వరలోనే..

సినిమా ఇండస్ట్రీలో వారసులు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వారసులను సినిమా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. బాధ్యతలు తీసుకుంటున్న తారక్.. త్వరలోనే..
Ntr
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2021 | 3:37 PM

Share

Jr NTR : సినిమా ఇండస్ట్రీలో వారసులు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వారసులను సినిమా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ విషయానికొస్తే చాలా మంది హీరోల కొడుకులు, ప్రొడ్యూసర్ల పిల్లలు సినిమాల్లో నటిస్తున్నారు. కేవలం వారసులుగానే కాకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటనతో డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్స్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో మరో హీరో రానున్నదని తెలుస్తుంది.

నందమూరి ఫ్యామిలీనుంచి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నటసార్వభౌమ ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రాణించారు. ఆతర్వాత కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, తారక రత్న హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది హీరోగా పరిచయం అవుతుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అతడి పేరు నార్నే నితిన్ చంద్ర. తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతికి తమ్ముడు. ప్రస్తుతం ఈ కుర్రాడు నటనలో, డ్యాన్సలలో శిక్షణ తీసుకుంటున్నదని తెలుస్తుంది. ఇక ఈ యంగ్ హీరో డెబ్యూ కోసం దర్శకుడిని కూడా వెతుకుంటున్నారట. అయితే బావమరిదిని హీరోని చేసే బాధ్యత తారక్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ కుర్రహీరోను దర్శకుడు తేజ పరిచయం చేయనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈవార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉన్నదనేది తెలిసియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aishwarya Rai : ముద్దు గురించి ముచ్చటిస్తున్న ఐశ్వర్యారాయ్.. ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..!

Gopichand Malineni : క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న క్రాక్ డైరెక్టర్.. మరో స్టార్ హీరోతో సినిమా..?

ఒకప్పుడు చేలో కూలి పనులు.. ఇప్పుడు గాల్లో ప్రయాణాలు.. గంగవ్వ ప్రస్థానం ఎందరికో ఆదర్శం..