AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand Malineni : క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న క్రాక్ డైరెక్టర్.. మరో స్టార్ హీరోతో సినిమా..?

ఈ ఏడాది మాస్ రాజా రవితేజతో క్రాక్ సినిమా తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. చాలా కాలంగా ఫ్లాప్ లతో  సతమతం అవుతున్న రవితేజకు

Gopichand Malineni : క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న క్రాక్ డైరెక్టర్.. మరో స్టార్ హీరోతో సినిమా..?
Gopichand Malineni
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2021 | 3:07 PM

Share

Gopichand Malineni  : ఈ ఏడాది మాస్ రాజా రవితేజతో క్రాక్ సినిమా తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. చాలా కాలంగా ఫ్లాప్లతో సతమతం అవుతున్న రవితేజకు ‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు గోపీచంద్. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ నటసింహం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నాడు. అందుకోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు గోపి. ఆ సినిమా తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్నాడు. బిబి3 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి అఘోరపాత్ర అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బాలయ్యతో సినిమా చేస్తున్నట్టు గోపీచంద్ మలినేని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. బోయపాటి సినిమా తర్వాత గోపీచంద్ సినిమా ఉండనుంది. అలాగే బాలయ్య తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో గోపీచంద్ మలినేని సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారిపాట అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఎవరితో మహేష్ సినిమా చేయబోతున్నాడన్నదని పైన క్లారిటీ లేదు . అయితే ఇప్పుడు మహేష్ తో మాస్ సినిమా తీయడానికి గోపీచంద్ మలినేని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ల్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ మహేష్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Major Movie Update: మేజర్‌ సందీప్ జయంతిన ‘మేజర్‌’ అప్‌డేట్‌.. ట్రైలర్‌ విడుదల చేస్తారా..?

ఒకప్పుడు చేలో కూలి పనులు.. ఇప్పుడు గాల్లో ప్రయాణాలు.. గంగవ్వ ప్రస్థానం ఎందరికో ఆదర్శం..