మొదటి సినిమాతోనే బంపర్ ఆఫర్ అందుకున్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్… మాస్ మాహారాజా సరసన ఫరియా..

మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకొని.. టాప్ హీరోయిన్స్‏గా ఎదిగినవారు చాలా మందే ఉన్నారు. ఇటీవల విడుదలైన సూపర్ హిట్ మూవీ ఉప్పెనతో వరుస

మొదటి సినిమాతోనే బంపర్ ఆఫర్ అందుకున్న 'జాతిరత్నాలు' హీరోయిన్... మాస్ మాహారాజా సరసన ఫరియా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2021 | 1:10 PM

మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకొని.. టాప్ హీరోయిన్స్‏గా ఎదిగినవారు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. ఇటీవల విడుదలైన సూపర్ హిట్ మూవీ ఉప్పెనతో వరుస ఆఫర్లను అందుకుంది కృతి శెట్టి. తాజాగా ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా మొదటి సినిమాతోనే బంపర్ ఆఫర్ అందుకుంది. ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన జాతిరత్నాలు మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది జాతిరత్నాలు. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా  నటించగా.. ఇందులో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలకపాత్రల్లో నటించారు.

ఈ మూవీలోని ‘చిట్టి నా బుల్ బుల్ చిట్టి’ అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. అలాగే ఈ మూవీలో ఫరియా అబ్దుల్ల తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ విడుదలకు ముందే రెబల్ స్టార్ ప్రభాస్ జాతిరత్నాలు ట్రైలర్ విడుదల చేస్తూ..ఈవిడెంటీ నాకంటే పొడవుగా ఉంది అన్న కామెంట్‏తో ఫరియా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా సమాచారం. మాస్ మాహారాజా రవితేజ్, త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందో. ఇందులో రవితేజ సరసన ఫరియా అబ్దుల్లాను హీరోయిన్‏గా తీసుకోవాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయాన్ని స్వయంగా రవితేజనే దర్శకనిర్మాతలకు చెప్పినట్లుగా తెలిస్తోంది. త్వరలోనే ఈ మూవీ గురించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  పీ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నాడు రవితేజ. ఇందులో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఖిలాడి సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖిలాడి మూవీని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read:

RRR Movie: జక్కన్న క్రియేటివిటి.. రాముడి కోసం ఎదురుచూస్తున్న సీత.. అదిరిపోయిన అలియా లుక్..