Karthika Deepam Serial: మోనిత విషయం చెప్పి ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన కార్తీక్… దీప ఆచూకీ కోసం సౌందర్య ముమ్మర ప్రయత్నాలు…

కార్తీక దీపం రేటింగ్ ను బీట్ చేయలేకపోయాయి. అంతగా తెలుగు పేక్షకులను ఆకట్టుకుందివంటలక్క.. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 986 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు ఎం జరగనుందో తెలుసుకుందాం..!

Karthika Deepam Serial: మోనిత విషయం చెప్పి ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన కార్తీక్... దీప ఆచూకీ కోసం సౌందర్య ముమ్మర ప్రయత్నాలు...
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2021 | 10:39 AM

Karthika Deepam Serial: మలయాళం సీరియల్ రీమేక్ గా బుల్లి తెరపై కార్తీక దీపం సీరియల్ ప్రసారం ప్రారంభమై మూడేళ్లకు పైగా అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ సీరియల్. ఏ షో లు కూడా కార్తీక దీపం రేటింగ్ ను బీట్ చేయలేకపోయాయి. అంతగా తెలుగు పేక్షకులను ఆకట్టుకుందివంటలక్క.. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 986 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు ఎం జరగనుందో తెలుసుకుందాం..!

సౌందర్య ,ఆనందరావు, ఆదిత్య, శ్రావ్య లు కూర్చుని దీప గురించి దిగులుగా ఆలోచిస్తుంటారు.. అదే సమయంలో కార్తీక్ ఎంటర్ అయ్యి… మళ్ళీ దీప గురించి మళ్ళీ అడుగు తాడు. నీకు తెలుసు ఎక్కడ ఉందొ.. హిమనీ నీకు తెలియకుండా తీసుకుని వెళ్ళదు.. హిమనీ తీసుకుని వెళ్తే.. హిమ కోసం నేను దిగివస్తానని అనుకుంటుంది ఆ దీప.. అని మోనిత చెప్పిన మాటలనే అమ్మని అడుగుతాడు.. అంతేకాదు ఎంతైనా ఒకప్పుడు నా భార్య కదా.. కావాల్సినంత డబ్బులు ఇచ్చేసి.. హిమనీ, శౌర్యని తెచ్చేసుకుందాం అని అంటాడు . దీంతో సౌందర్య కోపంగా డబ్బు కోసం సౌభాగ్యాన్ని, కన్న ప్రేమను వదులుకుంటే అది నా కోడలే కాదు అని అంటుంది.. ఎంత తక్కువ అంచనా వేశావు నా కోడలి అని అంటుంది. నిజంగా నాకు తెలియదు దీప ఎక్కడికి వెళ్లిందో అని సౌందర్య కోపంగా అంటుంటే.. మళ్ళీ కార్తీక్ నేను ఒకటి చెబుతాను.. అది విన్నాక నీకు హిమ ఎక్కడ ఉందో చెప్పాలని పిస్తే చెప్పు అంటాడు..

నాకు మోనిత ప్రామిస్ చేసింది.. హిమ ఎక్కడ ఉన్నా కనిపెట్టి నా దగ్గరకు తీసుకుని వస్తాను అని .. అలా తీసుకొస్తే.. నేను తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను.. అది జరగకూడదు అంటే.. ఇప్పటికైనా నువ్వు దీప ఎక్కడ ఉందో చెప్పు అంటాడు. అనగానే సౌందర్యతో పాటు అక్కడున్న శ్రావ్య, ఆదిత్య, ఆనందరావులు షాక్ అవుతారు. ఇప్పటి కైనా నా కూతురు ఎక్కడ ఉందొ చెప్పు లేదంటే నేను ఇచ్చిన మాటకు కట్టుబడి మోనిత ను పెళ్లి చేసుకుంటా.. అనగానే సౌందర్య కూతురు కోసం కట్టుకున్నాడు అన్యాయం చేసి.. వేరేదాని మేడలో తాళి కడతాను అంటున్న నిన్ను చూస్తే ఏమనుకోవాలి.. మూర్ఖత్వం అనుకోవాలా అంటుంది సౌందర్య.. ప్రేమ అనుకో తండ్రి ప్రేమ.. నాకు హిమ కావాలి.. అది నువ్వే ముందు ఎక్కడ ఉందొ చెప్పావంటే నేను ఎప్పటికీ మోనిత పెళ్లి చేసుకోను .. అంటూ మీద మెడకు వెళ్తుంటే.. నేను పుట్టి బుద్దెరిగిన తర్వాత ఇప్పటి వరకూ నాకు ఇటువంటి ప్రశ్న ఎదురు కాలేదు అంటుంది సౌందర్య..

ఆనందరావు నిజంగా కార్తీక్ మోనితను పెళ్లి చేసుకుంటాడేమో అని కంగారు పడుతుంటే… నేను బతికి ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను అంటుంది సౌందర్య.. ఇక మరోవైపు దీప ఇడ్లీ బండి వద్ద పిల్లలిద్దరి తో పాటు తాను కూడా కస్టమర్స్ కోసం ఎదురుచూస్తుంటారు.. ఇంతలో ఒక వ్యక్తి టిఫిన్ తినడానికి వచ్చి ప్లేస్ ఇడ్లీ ఆర్డర్ ఇస్తాడు.. టిఫిన్ తింటూ చాలా బాగుంది.. మంచి రుచిగా ఉంది అంటూ.. ఎంత కాస్ట్ అని అడుగుతాడు.. దీనితో వారణాసి ప్లేట్ ఇడ్లీ రూ. 10 మాత్రమే అంటాడు. ఐతే మరో నాలుగు ఇడ్లీలు పెట్టండి అని చెప్పి.. ఇక నుంచి నా ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడే తినమని చెబుతా అని ప్రశంసల వర్షం కురిపిస్తూ వెళ్తాడు.. ఇంతలో శౌర్య వారణాసిలో ఏంట్రా రాలేదు.. అని అడుగుతుంటే.. హిమ ఎవరు రాలేదు.. నాన్నా అంటుంది.. ఇంతలో దీప ఎవరు ఏంటి అని అడిగితే.. విషయం చెప్పకుండా నేను ఓ ఐడియా వేశాను.. అది కనుక సక్సెస్ ఐతే నువ్వు నలుగురు అసిస్టెంట్స్ ను పెట్టుకోవాల్సిందే అని అంటుంది. ఎవరొస్తారు.. నాన్నా అంటుంది హిమ..

ఇక సౌందర్య దీప వెదికే ప్రయత్నం ముమ్మరం చేస్తుంది. సౌందర్య మురళీకృష్ణ ఇంటికి వెళ్లి దీప ఆచూకీ ఎలాగైనా కనుకోమని చెబుతుంది. అందుకు ఎంత డబ్బులు అవసరమైనా సరే ఇస్తానని అంటుంది. ఆఫీస్ లో క్యాంప్ కు వెళ్లరని చెబుతా .. వెతకండి .. ఎక్కడ ఉన్నా వెతికి తీసుకుని రండి అంటుంది. దీప మోనిత కంట పడక ముందే మీరు ఎక్కడ ఉందో కనిపెట్టండి.. నేను తనని వెనక్కి తీసుకొస్తా అంటుంది సౌందర్య. నిజానికి నా కూతుర్ని వెదకడానికి నేను డబ్బులు తీసుకోకూడదు అని అని మురళీకృష్ణ ఫీల్ అవుతుంటే.. అదేంకాదు నేను నా కోడలు కోసం పెడుతున్న ఖర్చు.. ఎంతైనా పెడతా.. వాళ్ళు త్వరగా దొరికితే చాలు అంటుంది సౌందర్య.

మరోవైపు నాన్నా టిఫిన్ సెంటర్ దగ్గర ఓ కారు వచ్చి ఆగుతుంది.. దీంతో హిమ ఆశగా నాన్న వచ్చాడేమో అని అంటుంది. ఇంతో కారు నుంచి ఒక ఆమె టిఫిన్ కోసం దిగుతుంది.. ఆమెకు టిఫిన్ పెడుతుండగా.. మళ్ళీ ఇంకొకారు వచ్చి ఆగుతుంది. అప్పుడు వారణాసి, శౌర్యలు నవ్వుకుంటూ ఇదే నా ఐడియా అంటుంది.. మరి మోనిత దీపని హిమనీ వెదికే ప్రయత్నం ఎలా చేస్తుంది.. దీప ఆచూకీ ఎవరికీ ముందు చిక్కుతుంది.. మోనితకా .. లేక సౌందర్యకా.. అసలు ఎప్పటికీ మోనిత చెబుతున్న మాయమాటల నుంచి కార్తీక్ బయట పడడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం..!

Also Read:

సమ్మెబాట పట్టిన జాతీయ బ్యాంకులు.. సోమ, మంగళవారాల్లో బంద్..

పేరుకే స్మాల్ స్క్రీన్.. ప్లానింగ్ అంతా బిగ్ స్కేల్.. ఒక్కో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!