AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Update: రామరాజు కోసం సీత ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుండొచ్చు.. కానీ సీత కోసం మీ ఎదురుచూపులు మాత్రం..

RRR Update: ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాపై రోజురోజుకీ క్యూరియాసిటీ పెరిగిపోతోంది. చిత్ర యూనిట్‌ కూడా సినిమా అప్‌డేట్లతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీని సైతం టెంప్ట్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తోన్న..

RRR Update: రామరాజు కోసం సీత ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుండొచ్చు.. కానీ సీత కోసం మీ ఎదురుచూపులు మాత్రం..
Alia Bhatt In Rrr
Narender Vaitla
|

Updated on: Mar 15, 2021 | 1:22 AM

Share

RRR Update: ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాపై రోజురోజుకీ క్యూరియాసిటీ పెరిగిపోతోంది. చిత్ర యూనిట్‌ కూడా సినిమా అప్‌డేట్లతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీని సైతం టెంప్ట్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తోన్న రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్లు నెట్టింట్లో ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన నటిస్తోన్న బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ పాత్రను పరిచయం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు (సోమవారం) ఉదయం 11 గంటలకు సీత పాత్రను పరిచయం చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ గతకొన్ని రోజుల క్రితం ట్విట్టర్‌ వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇంకాసేపట్లో అలియా పాత్రను పరిచయం చేయనున్న సమయంలో.. ‘డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ మరో ఆసక్తికరమైన ట్వీట్‌ చేసింది. ఇందులో అలియాను చూపించి చూపించనట్లుగా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది. శ్రీరాముడి విగ్రహం ముందు కూర్చున్న అలియా భట్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘రామరాజు కోసం సీత ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుండొచ్చు.. కానీ సీత కోసం మీ ఎదురుచూపులు.. ఇంకా ఎంతోసేపు లేవు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. దీంతో సమయం 11 ఎప్పుడు అవుతుందా అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చేసిన ట్వీట్‌..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్‌ కొమ్రుం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇక సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అక్టోబర్‌ 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇండియాలోని దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పాత్రలు పోషిస్తుండడం విశేషం. మరి బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి.

Also Read: South Indian Heroine : అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న దక్షిణాది స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో గుర్తుపట్టగలరా..!

Patalakka Shyama : పాటలక్క శ్యామాగా డీ గ్లామర్ రోల్ లో చేస్తున్న కన్నడ నటి.. రియల్ గా ఎంత అందగత్తో తెలుసా..!

Parineethi Chopra Coments : జొమాటో మహిళను శిక్షించండి.. డెలివరీ బాయ్‌కి మద్దతు తెలిపిన బాలీవుడ్ సూపర్ బ్యూటీ..